Telangana Politics: రేవంత్ ప్రభుత్వంపై విశ్వాసం పెరిగిందా? విశ్వసనీయత తగ్గుతోందా..? కాంగ్రెస్‌ సర్కార్‌ @30 డేస్‌..

తెలంగాణలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ... నెలరోజులు పూర్తి చేసుకుంది. ఇప్పటికే గ్యారెంటీల అమలుపై పాలక ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తుండగా.. ఇప్పుడది తారస్థాయికి చేరుకుంది. నెలరోజుల్లో అహంకారం తప్ప.. హామీల అమలు అయితే, హామీలకు కట్టుబడి ఉన్నామంటున్న కాంగ్రెస్‌... వాటి అమలు కోసం కేబినెట్‌ సబ్‌ కమిటీని వేయడం విశేషం.

Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 08, 2024 | 6:56 PM

తెలంగాణలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్‌ ప్రభుత్వం … నెలరోజులు పూర్తి చేసుకుంది. ఇప్పటికే గ్యారెంటీల అమలుపై పాలక ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తుండగా.. ఇప్పుడది తారస్థాయికి చేరుకుంది. నెలరోజుల్లో అహంకారం తప్ప.. హామీల అమలు అయితే, హామీలకు కట్టుబడి ఉన్నామంటున్న కాంగ్రెస్‌… వాటి అమలు కోసం కేబినెట్‌ సబ్‌ కమిటీని వేయడం విశేషం.

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం నెలరోజుల ప్రొగ్రెస్‌ రిపోర్ట్‌ ఏమిటోగానీ … రాజకీయంగా గ్యారెంటీల ముచ్చట మరింత అగ్గిరాజేసింది. ప్రభుత్వం ఏర్పడి నెల గడిచినా… హామీల అమలులో జాప్యం చేస్తోందంటూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఫోర్‌ ట్వంటీ హామీలతో ప్రజల్ని కాంగ్రెస్‌ మోసం చేసిందంటూ.. తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పిస్తోంది బీఆర్‌ఎస్‌. అయితే హామీల అమలు కోసం ఒక సబ్‌కమిటీని వేసింది తెలంగాణ సర్కార్‌.

ఇన్నాళ్లూ కాస్త కామ్‌గా ఉన్న బీజేపీ సైతం.. కాంగ్రెస్‌పై విమర్శలు ఎక్కుపెట్టింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలులో కావాలనే ఆలస్యం చేస్తోందని ఎంపీ బండి సంజయ్ మండిపడ్డారు. నిధులతో సంబంధం లేని హామీల విషయంలోనూ ఎందుకు తాత్సారం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు.

అయితే, వందరోజుల్లో ప్రజాపాలన హామీల అమలుకు కట్టుబడి ఉన్నామంటోంది కాంగ్రెస్‌ ప్రభుత్వం. అందుకోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం, పొంగులేటి సభ్యులుగా.. ఒక సబ్‌ కమిటీని వేసింది. నెలరోజుల పాలనపై సమీక్ష చేసిన సీఎం రేవంత్‌.. వచ్చిన దరఖాస్తులపై సహచర మంత్రులతో చర్చించారు. ప్రజాపాలన వెబ్‌సైట్‌ను ప్రారంభించిన సీఎం.. 17వ తేదీ వరకు డేటా ఎంట్రీ పూర్తి చేయాలని ఆదేశించారు.

నెలరోజుల కాంగ్రెస్‌ పాలనపై మంత్ రిపోర్ట్‌ అనేమాట పక్కనపెడితే.. పొలిటికల్‌గా గ్యారెంటీల గరం.. ఇప్పట్లో చల్లబడేలా కనిపించడం లేదు. సాధారణ ఎన్నికల వరకు ఇదే రచ్చ కొనసాగేలా కనిపిస్తోంది. మరి, అదే జరిగితే.. రాజకీయంగా ఎవరికి లాభం? ఎవరికి నష్టం? అన్నదే తెలియాల్సి ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..