Kavitha: ఢిల్లీలో కూర్చొని మీడియాను తప్పుదారి పట్టించారు.. ఈడీ నోటీసుల ప్రచారంపై స్పందించిన కవిత

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ లో ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇచ్చిందంటూ కూడా ప్రచారం జరుగుతోంది. కాగా, ఈడీ నోటీసుల ప్రచారంపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు.

Kavitha: ఢిల్లీలో కూర్చొని మీడియాను తప్పుదారి పట్టించారు.. ఈడీ నోటీసుల ప్రచారంపై స్పందించిన కవిత
Mlc Kavitha

Updated on: Sep 16, 2022 | 5:00 PM

Delhi liquor scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ దేశ రాజకీయాల్లో కలకలం రేపింది.. ఇప్పటికే దీనిపై దర్యాప్తు ప్రారంభించిన ఈడీ.. దేశవ్యాప్తంగా ఆకస్మిక దాడులతో సంచలనం సృష్టిస్తోంది. ఇటీవల హైదరాబాద్ సహా పలు చోట్ల దాడులు చేసిన ఈడీ, తాజాగా శుక్రవారం కూడా.. దేశవ్యాప్తంగా ఈరోజు 40 చోట్ల సోదాలు నిర్వహిస్తోంది. అయితే, ఈ వ్యవహారంలో సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత హస్తం ఉందని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. దీంతోపాటు కవితకు ఈడీ నోటీసులు ఇచ్చిందంటూ కూడా ప్రచారం జరుగుతోంది. కాగా, ఈడీ నోటీసుల ప్రచారంపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు.

ఈడీ నుంచి తనకు ఎలాంటి నోటీసులు రాలేదని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. ఢిల్లీలో కూర్చొని మీడియాను తప్పుదారి పట్టించారన్నారు. నిజనిర్ధారణ తర్వాతే వార్తలు వేయాలి, రాయాలంటూ కవిత సూచించారు. ఈ సమయాన్ని నిజం చూపించడానికి ఉపయోగించమని మీడియా సంస్థలను అభ్యర్థించారు. ఈ మేరకు కవిత ట్విట్ చేశారు.

ఇవి కూడా చదవండి

కాగా, ఢిల్లీ లిక్కర్ స్కాం దాడుల్లో భాగంగా ఈడీ అధికారులు హైదరాబాద్‌లోని గోరంట్ల అసోసియేట్స్‌ కార్యాలయంలో సోదాలు చేశారు. దోమలగూడ అరవింద్‌నగర్‌లోని.. సాయికృష్ణ రెసిడెన్సీలో ఉంది గోరంట్ల అసోసియేట్స్. గోరంట్ల బుచ్చిబాబు కొందరు ప్రముఖులకు ఆడిటర్‌గా ఉన్నారు. చార్టెడ్ అకౌంట్‌కు సంబంధించిన ఆధారాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇంకా, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డికి నివాసంలోనూ సోదాలు జరిగాయి. ఢిల్లీ లోథీ రోడ్‌లోని 95వ నంబర్ బంగ్లాలో ఉదయం నుంచి తనిఖీలు జరుగుతున్నాయి. మాగుంట నెల్లూరు నివాసంలోనూ ఈడీ రెయిడ్స్ జరిగాయి.

దీంతోపాటు మాదాపూర్ లోని అనుస్ బ్యూటీ పార్లర్ హెడ్ ఆఫీస్‌లోనూ ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. అనూస్ బ్యూటీ పార్లర్ రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ఉంది. ఇప్పటికే రెండు సార్లు హైదరాబాద్‌లో దాడులు నిర్వహించిన ఈడీ… తాజాగా మళ్లీ హైదరాబాద్‌పైనే గురి పెట్టింది. దీంతో… ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ డొంక కదిలి.. ఇందులో తెలుగు రాష్ట్రాలకున్న లింకులు బైటపడతాయా అనే సందేహాలు మొదలయ్యాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం