Pilot Rohit Reddy: ‘ఎవరినో ఇబ్బంది పెట్టడానికి కాదు’.. ట్రోల్ వీడియోపై వివరణ ఇచ్చిన పైలెట్ రోహిత్ రెడ్డి..

|

Jul 15, 2023 | 1:49 PM

MLA Pilot Rohit Reddy: సెక్యూరిటీ సిబ్బందిని ఫోటోషూట్ల కోసం ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి వాడుకోవడంపై వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. ఆయనకు తెలంగాణ ప్రభుత్వం కల్పించిన వై కేటగిరి సెక్యూరిటీతో ఫోటోషూట్లకు ఉపయోగించడంపై ప్రత్యర్థి పార్టీల నుంచి..

Pilot Rohit Reddy: ‘ఎవరినో ఇబ్బంది పెట్టడానికి కాదు’.. ట్రోల్ వీడియోపై వివరణ ఇచ్చిన పైలెట్ రోహిత్ రెడ్డి..
MLA pilot Rohit Reddy
Follow us on

MLA Pilot Rohit Reddy: సెక్యూరిటీ సిబ్బందిని ఫోటోషూట్ల కోసం ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి వాడుకోవడంపై వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. ఆయనకు తెలంగాణ ప్రభుత్వం కల్పించిన వై కేటగిరి సెక్యూరిటీతో ఫోటోషూట్లకు ఉపయోగించడంపై ప్రత్యర్థి పార్టీల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే ఆయన ఫోటోషూట్‌కి సంబంధించిన వీడియో కూడా గరువారం ట్రోల్ అయింది. ఈ నేపథ్యంలో ఆ వీడియోపై ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి వివరణ ఇచ్చారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ ‘నరేంద్రమోదీ లెక్క కావాలని వీడియో తీసుకోలేదు. క్యాజ్వల్‌గా నడుచుకుంటూ వస్తుంటే మొబైల్‌లోని స్నాప్చాట్‌లో అక్కడి స్నేహితులు తీశారు. ఎవరినో ఇబ్బంది పెట్టడానికి కాద’న్నారు.

అలాగే ప్రభుత్వ సిబ్బందిని వీడియోల కోసం వాడుకునే రకం తాను కాదని, హోమం అయ్యాక పైనుంచి ఒక అదృశ్య స్పార్క్ వచ్చి మంటలు అంటుకున్నాయని, ఆ సమయంలో వేదపండితులు యగశాలలోనే ఉన్నారని, హోమం అంతా పూర్తి అయ్యాక మంటలు రావడం శుభపరిణామం అని పేర్నొన్నారు రోహిత్ రెడ్డి.

వైరల్ అయిన వీడియో..

ఇవి కూడా చదవండి


కాగా, మునుగోడు ఉపఎన్నికల సమయంలో చోటుచేసుకున్న ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి  ఫిర్యాదు దారుడిగా ఉన్నారు.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..