Crime News: డబుల్ ధమాకా అంటూ దోచేశారు.. ఘరానా దంపతుల నయా దందా.. చివరికి ఇద్దరూ కలిసి..

|

Nov 12, 2021 | 10:00 AM

Money Cheating: పెట్టిన పెట్టుబడికి అధిక డబ్బు వస్తుందని ఆశ చూపించి సుమారు నాలుగు కోట్ల రూపాయల మేర మోసం చేసిన ఘరానా దంపతులు కట్ల రమేష్, అతని భార్య రమాదేవిని

Crime News: డబుల్ ధమాకా అంటూ దోచేశారు.. ఘరానా దంపతుల నయా దందా.. చివరికి ఇద్దరూ కలిసి..
Wife And Husband
Follow us on

Money Cheating: పెట్టిన పెట్టుబడికి అధిక డబ్బు వస్తుందని ఆశ చూపించి సుమారు నాలుగు కోట్ల రూపాయల మేర మోసం చేసిన ఘరానా దంపతులు కట్ల రమేష్, అతని భార్య రమాదేవిని అరెస్ట్ చేశారు మిర్యాలగూడ టూ టౌన్ పోలీసులు. దీరిపై పిడి యాక్ట్ నమోదు చేసి చంచల్ గూడ సెంట్రల్ జైలుకు తరలించారు. మిర్యాలగూడ టూ టౌన్ సీఐ నిగిడాల సురేష్ తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ పట్టణంతో పాటు పరిసర ప్రాంతాలు, తెలిసిన వ్యక్తుల బలహీనతలు ఆసరాగా చేసుకుని తక్కువ పెట్టుబడి పెడితే కొద్ది కాలంలోనే అధిక డబ్బులు, లాభాలు పొందవచ్చని నమ్మబలికారు. ఇలా చాలా మందిని మోసం చేసారు. ‘‘ఇండియన్ గెలాక్సీ’’ పేరుతో సాగించిన ఈ దందాలో వీరిద్దరూ కలిసి 76 మంది నుండి నాలుగు కోట్ల రూపాయలు వసూలు చేశారు. ఆ తరువాతే వీరి అసలు రంగు బయటపడింది.

బాధితులకు చెప్పిన ప్రకారం డబ్బులు చెల్లించకుండా వాయిదాల పేరుతో కాలయాపన చేస్తూ వచ్చారు. పైగా తీసుకున్న సొమ్ము సైతం ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో పలువురు బాధితులు పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరిపారు. ప్రజలను మోసగించిన దంపతులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. తాజాగా బెయిలుపై విడుదల కావడంతో వారిని మరోసారి అదుపులోకి తీసుకుని.. జిల్లా ఎస్పీ ఏ.వి.రంగనాథ్ ఆదేశాల మేరకు మిర్యాలగూడ డిఎస్పీ వెంకటేశ్వర్ రావు పర్యవేక్షణలో పి.డి. యాక్ట్ నమోదు చేసి చంచల్ గూడ జైలుకు తరలించారు. అధిక వడ్డీలకు, స్వల్పకాలంలో తక్కువ పెట్టుబడితో అధిక మొత్తం ఇస్తామని చెప్పే వారితో జాగ్రత్తగా ఉండాలని, ఇలా ఎవరైనా మోసం చేసే ప్రయత్నం చేస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సీఐ నిగిడాల సురేష్ ప్రజలకు సూచించారు.

Also read:

Sandwich Recipe: మీ చిన్నారుల కోసం ఆహా అనే అవోకాడో శాండ్‌విచ్‌ని ఇంట్లోనే తయారు చేయండి..

Viral Video: వామ్మో! పాముపై ముద్దుల వర్షం కురిపించింది! వీడియో

Bullfighting-Andhra Pradesh: రెండు ఆంబోతుల మధ్య భీకర పోరు.. వీడియో చూస్తే గుండెలదరాల్సిందే..!