Road Accident: సరిగ్గా అదే స్పాట్‌.. మీర్జాగూడ వద్ద మరో యాక్సిడెంట్ .. ఎంతమంది చనిపోయారంటే?

Mirjaguda Road Accident: రంగారెడ్డి జిల్లా మీర్జాగూడలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మోకిల నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారు చెట్టును ఢీకొట్టడంతో ICFAI, MGIT యూనివర్సిటీలకు చెందిన నలుగురు విద్యార్థులు మరణించారు, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. గతంలో కూడా అదే ప్రాంతంలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ దుర్ఘటన ట్రాఫిక్ అంతరాయాలకు దారితీసింది.

Road Accident: సరిగ్గా అదే స్పాట్‌.. మీర్జాగూడ వద్ద మరో యాక్సిడెంట్ .. ఎంతమంది చనిపోయారంటే?
Mirjaguda Road Accident

Updated on: Jan 08, 2026 | 7:04 AM

గత ఏడాదిలో రంగారెడ్డి జిల్లా మీర్జాగూడ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో సుమారు 20 మందికి పైగా ప్రయాణికులు మృతి చెందిన ఘటన మరువక ముందే సరిగ్గా అదే ప్లేస్‌లో మరో ఘోర ప్రమాదం వెలుగు చూచింది. మోకిలా నుంచి హైదరాబాద్‌ వైపు వెళ్తున్న కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సుమారు నలుగు మృతి చెందగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక వాహన దారుల సమాచారంతో హుటాహుటీన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసలు మృతదేహాలను వెలికి తీసి పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. ICFAI యూనివర్సిటీ, MGIT కి చెందిన ఐదుగురు విద్యార్థులు మోకిల నుంచి హైదరాబాద్‌ కు కార్లో బయల్దేరారు. అయితే వారు ప్రయాణిస్తున్న కారు మీర్జాగూడ వద్దకు రాగానే అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఐదుగురిలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. ఒక విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను కార్లోంచి వెలికి తీసి, పోస్ట్‌ మార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. గాయపడిన వ్యక్తికి వైద్యం అందించారు.

అయితే ప్రమాదంలో చనిపోయిన నలుగురు వ్యక్తుల్లో సూర్యతేజా, సుమిత్, శ్రీనిఖిల్, రోహిత్ ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.ఇక రోడ్డు ప్రమాదం కారణంగా భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో ప్రమాదానికి గురైన కారును తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు పోలీసులు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.