AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mirchi Price: మిర్చి రైతన్నలూ మీకే ఈ గుడ్ న్యూస్.. ధర ఓ రేంజ్‌లో పెరిగింది..

అకాల వర్షాలతో అల్లాడుతున్న రైతులకు ఇది మంచి ఊరటనిచ్చే వార్త. వరంగల్ మార్కెట్‌లో మిర్చికి మంచి రేటు పలికింది. . ఈ ధర సీజన్ చివరి వరకు కొనసాగాలని రైతులు కోరుకుంటున్నారు. ఏయే రకం మిర్చి ఎంత రేటు ఉందో తెలుసుకుందాం పదండి ....

Mirchi Price: మిర్చి రైతన్నలూ మీకే ఈ గుడ్ న్యూస్.. ధర ఓ రేంజ్‌లో పెరిగింది..
Redchillies
Ram Naramaneni
|

Updated on: Nov 15, 2025 | 5:25 PM

Share

గతంలో తెలుగు రాష్ట్రాల్ల మిర్చి పంటకు ఈ మాయదారి తెగులు లేదు. గత నాలుగైదు ఏళ్లుగా కాత, పూత దశలో మిర్చి పంటను నాశనం చేస్తుంది తామర పురుగు. దీన్ని అరికట్టి పంటను కాపాడుకునేందుకు రైతులు తీవ్ర వ్యయప్రయాసలు పడుతున్నారు. వారం, పది రోజులకే మందు కొట్టాల్సి వస్తుంది. ఇక అకాల వర్షాల బెడద ఎలాగూ ఉంది. పాపం మిర్చి రైతులను ఆదుకునే నాధుడే లేకుండా పోయాడు. గత ఏడాది కూడా దిగుబడి బాగా తగ్గింది. రేటు కూడా అంతంత మాత్రంగానే ఉంది. అయితే ఈ ఏడాది రైతులకు కాస్త ఊరటనిచ్చే అంశం ఏంటంటే.. రేట్లు కాస్త బాగానే ఉన్నాయి. సీజన్ ప్రారంభంలో మిర్చి పంటకు మంచి రేటు దక్కింది. పంట దిగుబడి అధికంగా వచ్చే సమయంలో కూడా ఇదే రేటు కొనసాగితే రైతులకు కాస్త లాభసాటిగా ఉంటుంది.

శుక్రవారం రోజున వరంగల్‌‌ ఏనుమాముల మార్కెట్‌‌లో టమాటా రకం మిర్చి.. క్వింటార్ ధర ఏకంగా రూ.30 వేలు పలికింది. ఇక తేజ షార్క్‌‌ రకం మిర్చి కింటా… రూ.15,111లు పలికింది. దీంతో మిర్చి రైతులు ఊరట చెందారు. ఇదే ధర సీజన్ ఎండింగ్ వరకు కొనసాగితే అప్పుల నుంచి బయటపడుతామంటున్నారు.  అటు మొక్కజొన్న సైతం.. బిల్టీ రకం క్వింటాల్‌‌కు రూ.2,075 పలికింది. గత అనుభవాల వల్ల మిర్చి పంట ఈ ఏడాది ఎక్కువగా సాగు చేయలేదు. దీంతో ఈ సారి దిగుబడి తగ్గి మంచి ధర వచ్చే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

జామపండు మీ హెల్త్ గేమ్ ఛేంజర్.. రోజు ఒకటి తినడం వల్ల ఎన్ని లాభాలో
జామపండు మీ హెల్త్ గేమ్ ఛేంజర్.. రోజు ఒకటి తినడం వల్ల ఎన్ని లాభాలో
రామ్ చరణ్ పెద్ది సినిమాలో ఛాన్స్ వస్తే నో చెప్పా
రామ్ చరణ్ పెద్ది సినిమాలో ఛాన్స్ వస్తే నో చెప్పా
మనదేశంలో ఇప్పటివరకు రైలు కూత వినని రాష్ట్రం..! అది ఏ రాష్ట్రమంటే
మనదేశంలో ఇప్పటివరకు రైలు కూత వినని రాష్ట్రం..! అది ఏ రాష్ట్రమంటే
భారత రాష్ట్రపతి vs రష్యా అధ్యక్షుడు.. ఎవరి ఆదాయం ఎంత?
భారత రాష్ట్రపతి vs రష్యా అధ్యక్షుడు.. ఎవరి ఆదాయం ఎంత?
సెంచరీ హాట్రిక్ మిస్సయిందన్న అర్ష్‌దీప్‌ను ఆడుకున్న విరాట్
సెంచరీ హాట్రిక్ మిస్సయిందన్న అర్ష్‌దీప్‌ను ఆడుకున్న విరాట్
నిమ్మకాయ తొక్కలను తీసిపారేయకండి.. అవి చేసే అద్భుతాలు తెలిస్తే..
నిమ్మకాయ తొక్కలను తీసిపారేయకండి.. అవి చేసే అద్భుతాలు తెలిస్తే..
ఈ వారంలో నాలుగు రోజులు బ్యాంకులు బంద్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఈ వారంలో నాలుగు రోజులు బ్యాంకులు బంద్‌.. ఏయే రోజుల్లో అంటే..
సర్పంచ్ స్థానానికి భార్యభర్తలు ఇద్దరూ నామినేషన్
సర్పంచ్ స్థానానికి భార్యభర్తలు ఇద్దరూ నామినేషన్
ఇతగాడు మాములోడు కాదు.. RTI దరాఖాస్తు పెట్టిన అర్జీదారుడ్ని
ఇతగాడు మాములోడు కాదు.. RTI దరాఖాస్తు పెట్టిన అర్జీదారుడ్ని
అయ్యో.. అమ్మను అనాథలా వదిలేశారు.. ఈ తల్లి కథ తెలిస్తే గుండె..
అయ్యో.. అమ్మను అనాథలా వదిలేశారు.. ఈ తల్లి కథ తెలిస్తే గుండె..