AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇలాంటి పుత్రుడు పుట్టనేమి గిట్టనేమి.. కన్నతల్లినే కడతేర్చాడు..! కారణం తెలిస్తే..

నవమాసాలు మోసి, కని పెంచిన తల్లిని కంటికి రెప్పలా చూసుకోవాలి.. కానీ కొందరు నీచులు కన్న తల్లి అనే ప్రేమ లేకుండా, వారి పై దాడులు చేస్తూ.. చంపేస్తున్నారు.. తాజాగా ఇలాంటి ఘటనే సంగారెడ్డి జిల్లాలో వెలుగు చూసింది. మద్యానికి బానిసైన ఒక పుత్రరత్నం.. తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని.. ఏకంగా కన్న తల్లినే కడతేర్చాడు.

ఇలాంటి పుత్రుడు పుట్టనేమి గిట్టనేమి.. కన్నతల్లినే కడతేర్చాడు..! కారణం తెలిస్తే..
Sangareddy Crime
P Shivteja
| Edited By: Anand T|

Updated on: Nov 15, 2025 | 5:03 PM

Share

రోజురోజుకూ మనషుల్లో మానవత్వం మంటకలిసి పోతుంది. మద్యం, మత్తు పదార్థాలకు బానిసలైన కొందరు మత్తులో రక్త సంబంధాలనే తెంచుకుంటున్నారు. తాజాగా ఇలానే మద్యానికి బానిసైన ఒక పుత్రరత్నం..తాగేందుకు డబ్బులు అడిగితే ఇవ్వలేదని కన్న తల్లిని కడతేర్చాడు.. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా కోహీర్ (మం) బడంపేటలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా నివాసం ఉంటున్న బండమీది గోప్యమ్మ అనే మహిళకు బాలరాజు అనే కుమారుడు ఉన్నాడు. అయితే ఇతను గత కొన్నాళ్లుగా ఏ పని చేయకుండా జులాయిగా తిరుగుతూ మద్యానికి బానిస అయ్యాడు. దీంతో తరచూ తాగి వచ్చి ఇంట్లో గొడవలు పెట్టుకునేవాడు. కొన్నాళ్ల క్రితమే ఇతనికి పెళ్లి కూడా అయ్యింది. ఇతనికి భార్య ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కాగా తన తల్లి ఇంటి పక్కనే వేరే ఇంట్లో బాలరాజు ఉంటున్నాడు.

కాగా ఇటీవలి కాలంలో మద్యానికి బాగా అలవాటు అయిన బాల్ రాజు.. శుక్రవారం రాత్రిఫుల్‌గా మద్యం తాగాడు.. దీంతో అతని దగ్గర డబ్బులు అయిపోయాయి.. తాగేందుకు ఇంకా డబ్బులు కావాలని.. కొంత మందిని అడిగి చూసాడు.. కానీ ఎవరు డబ్బులు ఇవ్వకపోవడంతో.. చివరికి ఇంట్లో నిద్రిస్తున్న తల్లి గోప్యమ్మ వద్దకు వచ్చి తనకు డబ్బులు ఇవ్వాలని గొడవపడ్డాడు.

అయితే తన వద్ద డబ్బులు లేవని, ప్రతి రోజు మందు తాగడం ఎందుకు అని తల్లి బాలరాజ్‌ను ప్రశ్నించింది.. దీనితో ఇద్దరి మధ్య మాట మాట పెరగి గొడవ పెద్దదైంది. దీంలో రెచ్చిపోయిన బాల్‌రాజ్ అక్కడే ఉన్న ఒక కర్ర తీసుకొని తల్లి తలపై బలంగా కొట్టాడు. దీంతో దీనితో ఆమె అక్కడిక్కడే కుప్పుకూలీ పడిపోయింది. ఇది గమనించిన బాల రాజు అక్కడి నుండి పారిపోయాడు.

కొడుకు దాడి సమయంలో గోప్యమ్మ అరుపులు విన్న స్థానికులు వెంటనే ఆమె ఇంటికి చేరుకున్నారు. రక్తపు మడుగులో పడి ఉన్న గోప్యమ్మను వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికి ఆమె మృతి చెందింది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు హాస్పిటల్‌కు చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వా్స్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

స్టార్ హీరోల సినిమాల్లో నటించింది.. కానీ
స్టార్ హీరోల సినిమాల్లో నటించింది.. కానీ
తగ్గేదే లే.. 91 ఏళ్ల వయసులోనూ సర్పంచ్‌ బరిలో.. పోటీకి కారణం ఇదే..
తగ్గేదే లే.. 91 ఏళ్ల వయసులోనూ సర్పంచ్‌ బరిలో.. పోటీకి కారణం ఇదే..
35 ఏళ్ల తర్వాత రీఎంట్రీ..ఒకప్పటి ఈ టాలీవుడ్ హీరోను గుర్తుపట్టారా?
35 ఏళ్ల తర్వాత రీఎంట్రీ..ఒకప్పటి ఈ టాలీవుడ్ హీరోను గుర్తుపట్టారా?
16 ఏళ్ల తర్వాత కోహ్లీ-రోహిత్ రీఎంట్రీ.. ఎప్పుడు ఆడతారంటే..?
16 ఏళ్ల తర్వాత కోహ్లీ-రోహిత్ రీఎంట్రీ.. ఎప్పుడు ఆడతారంటే..?
జామపండు మీ హెల్త్ గేమ్ ఛేంజర్.. రోజు ఒకటి తినడం వల్ల ఎన్ని లాభాలో
జామపండు మీ హెల్త్ గేమ్ ఛేంజర్.. రోజు ఒకటి తినడం వల్ల ఎన్ని లాభాలో
రామ్ చరణ్ పెద్ది సినిమాలో ఛాన్స్ వస్తే నో చెప్పా
రామ్ చరణ్ పెద్ది సినిమాలో ఛాన్స్ వస్తే నో చెప్పా
మనదేశంలో ఇప్పటివరకు రైలు కూత వినని రాష్ట్రం..! అది ఏ రాష్ట్రమంటే
మనదేశంలో ఇప్పటివరకు రైలు కూత వినని రాష్ట్రం..! అది ఏ రాష్ట్రమంటే
భారత రాష్ట్రపతి vs రష్యా అధ్యక్షుడు.. ఎవరి ఆదాయం ఎంత?
భారత రాష్ట్రపతి vs రష్యా అధ్యక్షుడు.. ఎవరి ఆదాయం ఎంత?
సెంచరీ హాట్రిక్ మిస్సయిందన్న అర్ష్‌దీప్‌ను ఆడుకున్న విరాట్
సెంచరీ హాట్రిక్ మిస్సయిందన్న అర్ష్‌దీప్‌ను ఆడుకున్న విరాట్
నిమ్మకాయ తొక్కలను తీసిపారేయకండి.. అవి చేసే అద్భుతాలు తెలిస్తే..
నిమ్మకాయ తొక్కలను తీసిపారేయకండి.. అవి చేసే అద్భుతాలు తెలిస్తే..