Telangana: జల్సాల కోసం దారి తప్పిన మైనర్లు.. ఏం చేశారో తెలిస్తే షాక్ అవుతారు..

మొదట్లో నాటుకోళ్లు, సైకిళ్లు దొంగిలించిన ఆ చేతులు.. జల్సాలకు డబ్బు సరిపోకపోయేసరికి ఏకంగా బైక్ చోరీలకు స్కెచ్ వేశాయి. మార్కెట్‌లో డిమాండ్ ఉన్న పల్సర్ బైక్‌లనే టార్గెట్ చేస్తూ మిర్యాలగూడ, హుజూర్ నగర్, ఏపీలోని దాచేపల్లి ప్రాంతాల్లో హల్చల్ చేస్తున్న ముగ్గురు సభ్యుల ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు.

Telangana: జల్సాల కోసం దారి తప్పిన మైనర్లు.. ఏం చేశారో తెలిస్తే షాక్ అవుతారు..
Minor Bike Theft Gang Busted In Miryalaguda

Edited By:

Updated on: May 05, 2026 | 2:19 PM

తెలుగు రాష్ట్రాల్లో మైనర్లు దొంగతనాలకు అలవాటు పడుతున్న ఘటనలు ఇటీవల కాలంలో ఆందోళన కలిగిస్తున్నాయి. జల్సాలకు, చెడు వ్యసనాలకు బానిసలై, ఈజీ మనీ కోసం కొందరు మైనర్లు నేరాల బాట పడుతున్నారు. సిగరేట్ తదితర జల్సాలకు మొదట్లో నాటుకోళ్లు, సైకిళ్లు, స్క్రాప్ చోరీ చేశారు. జల్సాలకు ఎక్కువ డబ్బు అవసరం కావడంతో నల్గొండ జిల్లాలో యువకులు చోరీల బాట పట్టారు.
మిర్యాలగూడ హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన ముగ్గురు యువకులు బడికి వెళ్లకుండా జులాయిగా తిరుగుతూ హైస్కూల్ స్థాయిలోనే చదువు మానేశారు. మద్యం, సిగరేట్ తదితర జల్సాలకు అలవాటు పడ్డారు. జల్సాల కోసం చోరీలకు అలవాటు పడ్డారు. మొదట్లో నాటుకోళ్లు, సైకిళ్లు, స్క్రాప్ను చోరీచేసి విక్రయించగా వచ్చిన డబ్బుతో జల్సాలు చేశారు. ఎక్కువ డబ్బు కోసం బైక్ చోరీలకు ప్లాన్ చేశారు. గత ఏడాది మిర్యాలగూడలో దొంగిలించి విక్రయించి విలాసవంతమైన జల్సాలకు ఖర్చు చేశారు. అక్కడనుంచి మొదలైన చోరీల పరంపరా
ఉమ్మడి జిల్లాతోపాటు ఏపీ రాష్ట్రం పల్నాడు జిల్లా దాచేపల్లి వరకు కొనసాగించారు.

మిర్యాలగూడ, హుజూర్ నగర్, ఏపీలోని దాచేపల్లి ప్రాంతాల్లో బైక్ లను దొంగతనం చేస్తున్నారు. ఈ క్రమంలోఈ నెల 3న రాత్రి విద్యానగర్ ప్రాంతంలో బైక్‌ను దొంగలించారు. అదే సమయంలో అటుగా వచ్చిన పోలీసులు వీరిని పట్టుకునే ప్రయత్నం చేయగా, ఒకరు పారిపోగా మిగిలిన ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఇప్పటికే నిందితులపై మిర్యాలగూడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఆరు కేసులు నమోదు కాగా వాడపల్లి, హుజూర్ నగర్, ఏపీ దాచేపల్లి పోలీస్ స్టేషన్‌లో ఒక్కో కేసు నమోదైనట్లు పోలీసులు గుర్తించారు. మార్కెట్‌లో డిమాండ్ ఉన్న పల్సర్ బై‌క్‌లను మాత్రమే ఈ ముఠా దొంగిలిస్తోందని మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు తెలిపారు. నిందితుల నుంచి ఏడు పల్సర్ బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు.

Follow Us