AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఎన్నికల కోడ్ తరువాత తొలి కేబినెట్ భేటీ.. చర్చించనున్న అంశాలివే..

తెలంగాణ రాష్ట్రంలో ఆందోళనలకు కారణమైన జీవో 317పై భేటీకానున్న కేబినెట్ సబ్‌ కమిటీ ఏం తేల్చనుంది.? స్థానికత కోల్పోయిన ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యపై ఎలాంటి క్లారిటీ ఇవ్వనుంది.? ఈ ప్రశ్నలకు సమాధానాల కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు. జూన్ 12 మధ్యాహ్నం మూడు గంటలకు తెలంగాణ కేబినెట్‌ సబ్‌ కమిటీ భేటీకానుంది. జీవో 317, జీవో 46పై ప్రధానంగా చర్చ జరగనుంది. మంత్రులు దామోదర రాజనర్సింహా, శ్రీధర్‌బాబుతో పాటు పొన్నం ప్రభాకర్‌ ఈ కేబినెట్‌ సబ్‌ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. గత ప్రభుత్వం హయాంలో తీసుకొచ్చిన 317 జీవో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు కారణమైంది.

Telangana: ఎన్నికల కోడ్ తరువాత తొలి కేబినెట్ భేటీ.. చర్చించనున్న అంశాలివే..
Telangana
Srikar T
|

Updated on: Jun 12, 2024 | 9:15 AM

Share

తెలంగాణ రాష్ట్రంలో ఆందోళనలకు కారణమైన జీవో 317పై భేటీకానున్న కేబినెట్ సబ్‌ కమిటీ ఏం తేల్చనుంది.? స్థానికత కోల్పోయిన ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యపై ఎలాంటి క్లారిటీ ఇవ్వనుంది.? ఈ ప్రశ్నలకు సమాధానాల కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు. జూన్ 12 మధ్యాహ్నం మూడు గంటలకు తెలంగాణ కేబినెట్‌ సబ్‌ కమిటీ భేటీకానుంది. జీవో 317, జీవో 46పై ప్రధానంగా చర్చ జరగనుంది. మంత్రులు దామోదర రాజనర్సింహా, శ్రీధర్‌బాబుతో పాటు పొన్నం ప్రభాకర్‌ ఈ కేబినెట్‌ సబ్‌ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. గత ప్రభుత్వం హయాంలో తీసుకొచ్చిన 317 జీవో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు కారణమైంది. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల విధుల కేటాయింపుల్లో స్థానికత అనే అంశాన్నే మరిపోయిని సీనియార్టీకి పెద్దపీట వేశారంటూ ఉద్యోగులు పెద్ద ఎత్తున రోడ్డెక్కారు. తమ జిల్లాల్లో కాకుండా పరాయి జిల్లాల్లో విధులు నిర్వహించాల్సి వస్తుందంటూ నిరసన వ్యక్తం చేశారు. వందల కిలోమీటర్ల సుదూర ప్రాంతాలకు ప్రతిరోజూ ప్రయాణం చేయలేక శారీరక, మానసిక సమస్యలతో బలవంతంగా విధులు నిర్వహించాల్సి వస్తోందంటూ ఆందోళనలకు దిగారు.

ఇక ఇటీవల రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 317జీవో బాధితులకు ఖచ్చితంగా న్యాయం చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో స్పష్టమైన హామీ ఇచ్చింది. అసెంబ్లీ సమావేశాల్లోనూ సీఎం రేవంత్ రెడ్డి కూడా స్థానికత కోల్పోయిన ఉద్యోగ, ఉపాధ్యాయులను తప్పకుండా త్వరలోనే వారి సొంత జిల్లాలకు పంపిస్తామని, వారి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అందులోభాగంగానే జీవో 317 బాధితులు నేరుగా వారి స‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్యలను తెలిపేందుకు గ్రీవెన్స్ వెబ్ పోర్టల్​ను అందుబాటులోకి తెచ్చారు. అంతేకాదు 317 జీవోపైన కేబినెట్‌ సబ్‌ కమిటీ కూడా వేసి.. సమస్య పరిష్కారం కోసం పనిచేస్తున్నారు. మొత్తంగా.. ఇవాళ భేటీకానున్న కేబినెట్‌ సబ్ కమిటీ మీటింగ్‌ చర్చనీయాంశంగా మారింది. జీవో 317పై సబ్‌ కమిటీ ఏం తేల్చుతుందా.? అన్న ఉత్కంఠ ఉద్యోగుల్లో నెలకొంది. దీంతోపాటు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అమలు చేయాల్సిన వాటిపై కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఆగస్ట్ లోగా రైతు రుణమాఫీ చేస్తానన్న సీఎం రేవంత్, దానిపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. దీనిపై కూడా చర్చజరిగే అవకాశం కనిపిస్తోంది. ఎన్నిలక కోడ్ ముగిసిన తరువాత జరగనున్న మొదటి క్యాబినెట్ సమావేశం కావడంతో సర్వత్రా ఆసక్తినెలకొంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..