
Palle Pragathi Program Mancherial District: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పల్లె ప్రకృతి వనాలు.. గ్రామీణ ప్రాంతంలో ప్రశాంతతకు నిలయాలుగా మారుతున్నాయని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ పల్లె, పట్టణ ప్రగతిలో భాగస్వామ్యం కావాలని వారు పిలుపునిచ్చారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలంలోని కిష్టంపేట గ్రామంలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్సీ పురాణం సతీష్‌తో కలిసి.. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి పల్లెపకృతి వనాన్ని సందర్శించి మొక్కలు నాటారు. అనంతరం పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ.. పల్లె, పట్టణ ప్రగతిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలన్నారు. దీనిలో భాగంగా పారిశుధ్యం, ఆరోగ్యం, మౌలిక వసతులు, విద్యుత్ సమస్యల పరిష్కారం, హరితహారంలో ఇంటింటికీ ఆరు మొక్కల పంపిణీ తదితర అంశాలపై అధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టి పెట్టాలని సూచించారు.
Palle Pragathi Program Mancherial
ప్రజలందరి భాగస్వామ్యంతో గ్రామాలను సుందరంగా తీర్చిదిద్దాలని ఎర్రబెల్లి దయాకర్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో.. పల్లెలు, పట్టణాల్లో పరిశుభ్రత, పచ్చదనం పెరిగి అభివృద్ది చెందుతున్నాయన్నారు. అటవీ పునర్జీవన చర్యల్లో భాగంగా అడవుల్లో విస్తృతంగా మొక్కలు భారీగా నాటామన్నారు. భారతదేశంలో ఎక్కడా లేని వనరులు మన రాష్ట్రంలో ఉన్నాయన్నారు. గ్రామీణ ప్రజానికానికి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించటం కోసం ప్రభుత్వం ప్రకృతి వనాలను ఏర్పాటు చేస్తుందన్నారు. సర్పంచ్‌లు గ్రామాల్లో పారిశుధ్యంపై దృష్టి సారించాలన్నారు. ఏడో విడుత హరితహారంలో భాగంగా ఎక్కడ ఖాళీ స్థలాలు ఉంటే అక్కడ మొక్కలను నాటాలని పిలుపునిచ్చారు. నాటిన మొక్కలను సంరక్షించేందుకు గ్రామ కార్యదర్శులు దృష్టి సారించాలని.. పూర్తైన పల్లె ప్రకృతి వనాల చుట్టూ ఫెన్సింగ్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, కలెక్టర్ భారతీ హోళీ కేరి పలువురు పాల్గొన్నారు.
Also Read: