మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో విచిత్రాలు.. బట్టలు ఇస్త్రీ చేసిన మంత్రి.. ఎవరో గుర్తు పట్టారా..?

తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోరు ప్రచారంతో హోరెత్తుతోంది. పోలింగ్‌కు సమయం దగ్గరపడుతుండటంతో ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఎన్నికల్లో ప్రజల విశ్వాసం పొందేందుకు అభ్యర్థులు, నేతలు కొత్త పోకడలను అనుసరిస్తున్నారు. తమ అభ్యర్థుల గెలుపునకు మంత్రులు, నేతలు పలు ప్రచార కార్యక్రమాలతో ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో విచిత్రాలు.. బట్టలు ఇస్త్రీ చేసిన మంత్రి.. ఎవరో గుర్తు పట్టారా..?
Minister Uttam Kumar Reddy Ironed Clothes

Edited By:

Updated on: Feb 06, 2026 | 4:11 PM

తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోరు ప్రచారంతో హోరెత్తుతోంది. పోలింగ్‌కు సమయం దగ్గరపడుతుండటంతో ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఎన్నికల్లో ప్రజల విశ్వాసం పొందేందుకు అభ్యర్థులు, నేతలు కొత్త పోకడలను అనుసరిస్తున్నారు. తమ అభ్యర్థుల గెలుపునకు మంత్రులు, నేతలు పలు ప్రచార కార్యక్రమాలతో ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.

పోలింగ్ తేదీ సమీపిస్తుండడంతో ప్రధాన పార్టీల నేతలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇందులో భాగంగా సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ఓటర్లకు వివరిస్తూ అధికార పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. పురపాలికలు మరింత అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరుతున్నారు.

అలాగే హుజూర్ నగర్ మున్సిపాలిటీలోని 17వ వార్డులో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో పక్కనే ఉన్న ల్యాండ్రీ షాపులోకి మంత్రి వెళ్లారు. బట్టలను ఇస్త్రీ చేస్తున్న లాండ్రీ మెన్ నుంచి ఇస్త్రీ పెట్టెను తీసుకుని మంత్రి ఉత్తమ్ స్వయంగా బట్టలను ఐరన్ చేశారు. లాండ్రీ మెన్ తో మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎలా అందుతున్నాయని అడిగి తెలుసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది.

వీడియో ఇక్కడ క్లిక్ చేయండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..