AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rythu Bandhu: తెలంగాణ రైతులకు గుడ్‌ న్యూస్‌.. రేపటినుంచే ఖాతాల్లోకి డబ్బు..

తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు నిధులు విడుదల చేసేందుకు సన్నాహాలను ప్రారంభించింది. ఈ మేరకు కీలక వివరాలను సేకరించడంతోపాటు.. ఒకేసారి నిధుల విడుదల కోసం కసరత్తులను ప్రారంభించింది. ఈ క్రమంలో రైవంత్ సర్కార్.. రైతు బంధు నగదు విడుదలపై కీలక అప్డేట్ వచ్చంది. ఈ నెలాఖరులోగా రాష్ట్ర రైతుల ఖాతాల్లోకి రైతుబంధు నగదు జమవుతుందని వ్యవసాయ శాఖ మంత్రి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టంచేశారు.

Rythu Bandhu: తెలంగాణ రైతులకు గుడ్‌ న్యూస్‌.. రేపటినుంచే ఖాతాల్లోకి డబ్బు..
Rythu Bandhu
Prabhakar M
| Edited By: Shaik Madar Saheb|

Updated on: Jan 17, 2024 | 4:31 PM

Share

తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు నిధులు విడుదల చేసేందుకు సన్నాహాలను ప్రారంభించింది. ఈ మేరకు కీలక వివరాలను సేకరించడంతోపాటు.. ఒకేసారి నిధుల విడుదల కోసం కసరత్తులను ప్రారంభించింది. ఈ క్రమంలో రైవంత్ సర్కార్.. రైతు బంధు నగదు విడుదలపై కీలక అప్డేట్ వచ్చంది. ఈ నెలాఖరులోగా రాష్ట్ర రైతుల ఖాతాల్లోకి రైతుబంధు నగదు జమవుతుందని వ్యవసాయ శాఖ మంత్రి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టంచేశారు. బుధవారం నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన తుమ్మల నాగేశ్వరరావు.. రైతు బంధు నిధుల విడుదలపై మాట్లాడారు. నందమూరి తారక రామారావు స్ఫూర్తితో రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతాంగ సంక్షేమానికి కృషి చేస్తుందన్నారు. ఆంధ్రానగర్ లో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ చేసిన మంత్రి తుమ్మల.. నిజామాబాద్ జిల్లా వ్యవసాయానికి పెట్టింది పేరంటూ పేర్కొన్నారు. ఎన్టీఆర్ నేటికీ తన ఆదర్శ నాయకుడంటూ మంత్రి పేర్కొన్నారు. రైతుల సంక్షేమం కోసం ఎన్టీఆర్ ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొచ్చారంటూ పేర్కొన్నారు. ఈ సందర్భంగా.. రైతుబంధుతోపాటు.. రుణమాఫీపై కూడా తుమ్మల నాగేశ్వరరావు స్పందించారు. రెండు లక్షల రైతుల రుణమాఫీని దశలవారీగా రైతు ఖాతాల్లోకి జమ చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోందని.. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.

ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే, రైతు డిక్లరేషన్ ను అమలు చేసి తీరుతామని తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఇప్పటికే రెండెకరాల లోపు వ్యవసాయ భూమి కలిగిన 29 లక్షల మంది రైతులకు రైతు బంధు అందించామని, మిగతా రైతులకు కూడా రేపటి నుంచి వారి ఖాతాల్లో రైతు బంధు డబ్బులు జమ అయ్యేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఈ నెలాఖరు లోపు రైతులందరి ఖాతాల్లో రైతు బంధు నిధులు పడతాయన్నారు.. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, రైతాంగ ప్రయోజనాలే పరమావధిగా పని చేస్తామని అన్నారు. రైతాంగ అవసరాలు, కష్టాలు తెలిసిన వ్యక్తిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రైతుల సంక్షేమానికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని తెలిపారు. ఆర్ధిక ఇబ్బందులు నెలకొని ఉన్నప్పటికీ రైతాంగ ప్రయోజనాల విషయంలో ఎంతమాత్రం రాజీ పడబోమని, ఎన్నికల సమయంలో రైతాంగ డిక్లరేషన్ లో పొందుపర్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని మంత్రి భరోసా కల్పించారు. ఇప్పటికే రెండెకరాలలోపు వ్యవసాయ భూమి కలిగిన 29 లక్షల మంది రైతులకు రైతు బంధు అందించామని, మిగతా రైతులకు కూడా రేపటి నుంచి వారి ఖాతాల్లో రైతు బంధు డబ్బులు జమ అయ్యేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఈ నెలాఖరు లోపు రైతులందరి ఖాతాల్లో రైతు బంధు నిధులు పడతాయని స్పష్టం చేశారు. రైతులకు రుణమాఫీని అమలు చేసే విషయంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతో పట్టుదలతో కృషి చేస్తున్నారని అన్నారు.

యాసంగి సీజన్‌లో రైతుబంధు వేయడానికి రూ.7,625 కోట్ల నిధులు అవసరం కాగా.. ఇప్పటివరకు ఎకరం లోపు పొలం ఉన్న 21 లక్షల మంది రైతులకు ప్రభుత్వం రూ.1,050 కోట్లు జమ చేసింది. మిగతా రైతులకు మనీ రావాల్సి ఉంది. మిగతా నిధుల కోసం కేంద్రాన్ని రూ.13,500 కోట్ల రుణం తీసుకునేందుకు అనుమతి కోరగా.. కేంద్రం రూ.9 వేల కోట్ల రుణం తీసుకోవడానికి అనుమతి ఇచ్చింది. వాటిలో 2 వేల కోట్లు ఈనెల వచ్చే అవకాశం ఉందని తెలిసింది. ఈ రుణం నుంచి కొంత రైతుబంధు పథకం కింద రైతులకు జమ చేసే అవకాశాలు ఉన్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..