తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా BRS చేపట్టిన ఆత్మీయ సమ్మేళనాలను పండుగలా నిర్వహించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అన్ని నియోజకవర్గాల్లో ఈనెల 25వ తేదీన నియోజకవర్గస్థాయి బీఆర్‌ఎస్ పార్టీ ఆత్మీయ సమావేశాలను పండుగ వాతావరణంలో నిర్వహించాలని సూచించారు. సీఎం కేసీఆర్, పార్టీ వరింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఆత్మీయ సమ్మేళనాలు ఎంతో ఉత్సాహంగా సాగుతున్నాయని అన్నారు.
హైదరాబాద్ నగరంలో కూడా అనేక నియోజకవర్గాల్లో డివిజన్ స్థాయి సమ్మేళనాలు ఘనంగా నిర్వహించారని చెప్పారు. 24 నాటికల్లా డివిజన్ స్థాయి సమావేశాలు పూర్తి చేయాలని, మిగిలిన డివిజన్లలో కూడా ఈనెల 24వ తేదీ లోగా నిర్వహించేలా ఏర్పాట్లు చేసుకోవాలని మంత్రి తలసాని సూచించారు. సమ్మేళనాల సందర్భంగా జెండాలు, తోరణాలతో సర్వాంగ సుందరంగా అలంకరించాలన్నారు. ఆయా నియోజకవర్గాల్లో జరిగిన అభివృద్ధి పనులను తెలియజెప్పేలా ప్రగతి నివేదికను రూపొందించి ఆత్మీయ సమ్మేళనంలో వివరించాలని చెప్పారు.
ఈ నెల 25వ తేదీన నిర్వహించే నియోజకవర్గ సమ్మేళనాలకు నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, కార్పొరేటర్‌లుగా పోటీ చేసిన వారిని, డివిజన్ పార్టీ అధ్యక్షులు, ముఖ్య నాయకులను ఆహ్వానించాలని వివరించారు. అన్ని డివిజన్లలో పార్టీ పతాకాలను ఆవిష్కరించి సమావేశం వద్దకు రావాలని చెప్పారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం..