ఫోన్లన్నీ భద్రంగా ఉన్నాయి.. కవితకు కిషన్‌ రెడ్డి క్షమాపణలు చెప్పాలి- మంత్రి శ్రీనివాస్ గౌడ్

|

Mar 21, 2023 | 3:10 PM

దేశ ప్రజలు అన్ని గమనిస్తున్నారు... ధైర్యంగా ఎదుర్కొనేందుకు అందరూ ఏకం కావాల్సి ఉంది. గతంలో ఈ అంశంపై మాట్లాడిన ప్రతిఒక్కరు ముక్కు నేలకు రాయాలి. బెదిరింపులకు భయపడేది లేదు.

ఫోన్లన్నీ భద్రంగా ఉన్నాయి.. కవితకు కిషన్‌ రెడ్డి క్షమాపణలు చెప్పాలి- మంత్రి శ్రీనివాస్ గౌడ్
Minister Srinivas Goud
Follow us on

కవిత విచారణలో ఫోన్ల ధ్వసం ఎపిసోడ్‌పై డైలాగ్‌వార్ నడుస్తోంది. గతంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన ఆరోపణలను ప్రశ్నిస్తోంది BRS. నిజమో కాదో తెలుసుకోకుండా ఆరోపణలు చేసిన కిషన్‌రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు మంత్రి శ్రీనివాస్‌గౌడ్. ఏ ఆధారం లేకుండా ముందే ఉంహించి నవంబర్ లోనే సెల్ ఫోన్లు ఉన్నాయా ? లేవా ..? నోటిసిలు కూడా ఇవ్వకుండా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఆడబిడ్డ ఎమ్మెల్సీ కవితను… బాధ్యతగల వ్యక్తిగా ఆడబిడ్డ పై ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. సెల్‌ఫోన్ల విషయం నిన్న అడిగితే ఇవాళ తీసుకువస్తున్న అని ఎమ్మెల్సీ కవిత చెప్పిందన్నారు. గతంలోనే ఫోన్లన్ని భద్రంగా ఉన్నాయని చెప్పిందన్నారు. ఈ రోజు ఓ లేఖ ద్వారా ఈడీ కి సమర్పించిందన్నారు. దీనికి ఎం సమాధానం చెప్తారు కిషన్ రెడ్డి అంటూ నిలదీశారు.

కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి మతి భ్రయమించి మాట్లాడుతున్నారని అన్నారు. రాని మెడికల్ కాలేజి వచ్చిందని చెప్తారు అని ఎద్దేవా చేశారు. మీకు ఓ బిడ్డ ఉంది… తెలియదా తెలంగాణ ఉద్యమంలో ఎంత మంది ఆడవాళ్లు కొట్లాడారు తెలుసా. ఒకరిమీద మాట్లాడేప్పుడు ఆలోచించి మాట్లాడాలి. ఒక ఆడబిడ్డ ప్రతిష్ఠకు భంగం కలిగించారు… అసభ్యకరంగా మాట్లాడారు. ముందే ఈ అంశంపై ఢిల్లీలో ఇద్దరు బిజెపి ఎంపీలు ఎలా మాట్లాడుతారు. దేశ ప్రజలారా ఆలోచించండి. ఫోన్లు ఉన్నాయా, ఏమయ్యాయి అని సమాచారం అడగలేదు. కోట్ల విలువగల ఫోన్లు ధ్వంసం అయ్యాయని కిషన్ రెడ్డి ఎలా మాట్లాడారు.? ఉద్దేశపూర్వకంగా కెసిఆర్ ను ఎదుర్కోలేక ఈ వ్యవహారాలకు పాల్పడుతున్నారని మంత్రి శ్రీనివాస్‌ ఆరోపించారు.

దేశంలో యువత, మేథావులు, నాయకులు ఆలోచన చేస్తున్నారు. ఒక అడబిడ్డపైన మీ ప్రతాపమా..? 100 కోట్ల స్కామ్ అయితే… మీ నీరవ్ మోదీ, లలిత్ మోదీ, విజయ్ మాల్యా, ఆదానివి ఎన్ని లక్షల కోట్లు ఆవిరై పోయాయి. చోక్సీ భాయి చోక్సీ భాయి అని మాట్లాడారు. చోక్సీ భాయి ని కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రెడ్ కార్నర్ నోటీసులను ఉపసంహరించుకుంటూ… రెడ్ కార్పెట్ వేస్తున్నారు. లక్షల కోట్ల రూపాయలు దోచుకున్న వ్యక్తులను వదిలేశారు. దేశ సంపద దోచుకొని యూకే లో జల్సాలు చేస్తున్నారు. దోస్తులను వదిలేసి… తెలంగాణ బిడ్డను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. 10 నెలలుగా ఆడబిడ్డను వేధిస్తున్నారు. ఎప్పుడు పిలిచిన ఎమ్మెల్సీ కవిత వచ్చింది. ఊరికే గంటలు గంటలు కూర్చోబెట్టారు. కొన్ని టివి చానెళ్ల పైశాచికం ఆనందం ఏంటి.? కొందరు చేయవట్టి అందరికి చెడ్డ పేరొస్తుందన్నారు. నాలుగో స్థంభంగా ఉన్న మీడియా చాలా బాధ్యతగా వ్యవహరించాలి. ఎలాంటి ఆధారాలు లేకపోయినా ఉన్నవి లేనట్టు… లేనివి ఉన్నట్టు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

నవంబర్ లో ఒక్క నోటీసు అయిన ఇచ్చారా…? ఇప్పుడు తలకాయ ఎక్కడ పెట్టుకుంటావ్ కిషన్ రెడ్డి అంటూ ఘాటుగా వ్యాఖ్యనించారు. అడపిల్ల అని చూడకుండా ఫోన్లు ధ్వంసం చేసారని చెప్పాలనే ఆలోచన ఎలా వచ్చింది. ఇష్టానుసారంగా మాట్లాడితే ప్రజలు క్షమించరు. ఎలాగైనా ఇరికించాలని చూస్తున్నారు. దేశం లూటీ చేసినోళ్ళను వదిలేస్తున్నారు. తెలంగాణ కోసం తెగించి కొట్లాడిన ఆడబిడ్డను పండుగ అని కూడా చూడకుండా హింసిస్తున్నారు. మీకు తగిన శాస్తి జరుగుతుందన్నారు. అధికారం శాశ్వతం కాదు. తెలంగాణ మాదిరి పరిపాలన మీ బిజెపి పాలిత ఏ రాష్ట్రంలోనైనా ఉందా చెప్పగలరా..? ప్రశ్నించే గొంతులను పిసికేస్తున్నారు. కేసులున్న వాళ్ళు బీజేపీల చేరితే అయితే గంగ నదిలో మునిగినట్టు… పాపాలు పోతాయి అన్నట్టు చేస్తున్నారు. మీకు చేతనైతే తెలంగాణకు మేలు చేయండి. సౌత్ గ్రూప్, పేరుతో మహిళన ఇబ్బందులు పెడుతున్నారు. ఈ రకంగా వ్యవహారం నడపడం దేశానికి మంచిది కాదు.

ఎన్ని కేసులు పెట్టిన న్యాయస్థానాలపై మాకు నమ్మకం ఉంది. ఇవాళ తాము ఇచ్చిన లేఖపై కిషన్ రెడ్డి సమాధానం చెప్పి క్షమాపణ కోరాలి. అధికారం మా చేతిలో ఉందని ఇష్టారీతి వ్యవహరిస్తే ఉరుకోము… తెలంగాణ గడ్డ ఇది. స్వెచ్ఛకు భంగం కలిగేలా వ్యవహరిస్తున్నారు. దేశంమీద గౌరవం ఉంటే… దేశాన్ని దోచుకునే వాళ్ళను ఢిల్లీ గడ్డపై ఉరితీయండి. దేశ ప్రజలు అన్ని గమనిస్తున్నారు… ధైర్యంగా ఎదుర్కొనేందుకు అందరూ ఏకం కావాల్సి ఉంది. గతంలో ఈ అంశంపై మాట్లాడిన ప్రతిఒక్కరు ముక్కు నేలకు రాయాలి. బెదిరింపులకు భయపడేది లేదు. మీకు లొంగి ఏమి చేయం. తెలంగాణ, దేశం అంటే కెసిఆర్ కు ప్రాణం. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాడు ముఖ్యమంత్రి కేసీఆర్. మీకు చేతనైతే అవి అమలు చేయండి. ఫోన్లన్ని భద్రంగా ఉన్నాయని చెప్పారు.

మొదట మాట్లాడిన ఇద్దరు బిజెపి ఎంపీలు ఇప్పుడు ఎక్కడకు పోయారు. ఏ ఆధారాలు ఉన్నాయో… వారిని ఎందుకు విచారించరు. కాళేశ్వరం గొప్ప ప్రాజెక్టు అని చెప్పిందే కేంద్ర ప్రభుత్వం. తెలంగాణ బిడ్డ సింహం లా గర్జిస్తుంది. రాణి రుద్రమ , చాకలి ఐలమ్మ పుట్టిన గడ్డపై పుట్టిన పులి బిడ్డ ఎమ్మెల్సీ కవిత అన్నారు మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌.