Khammam Politics: పువ్వాడ అజయ్‌ వర్సెస్‌ పొంగులేటి.. కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్‌..

|

May 31, 2023 | 7:22 AM

ఖమ్మం రాజకీయాలు కాకరేపుతున్నాయి. పొంగులేటి టార్గెట్‌గా గేర్‌ మారుస్తున్నారు కారు పార్టీ నేతలు. పువ్వాడ అజయ్‌పై ఇష్టారీతిన మాట్లాడితే సహించేదిలేదని వార్నింగ్‌ ఇస్తోంది బీఆర్ఎస్‌ క్యాడర్‌.

Khammam Politics: పువ్వాడ అజయ్‌ వర్సెస్‌ పొంగులేటి.. కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్‌..
Ponguleti Srinivas Reddy - Puvvada Ajay
Follow us on

ఖమ్మం జిల్లాలో పాలిటిక్స్‌ హీటెక్కుతున్నాయి. బీఆర్ఎస్‌కు ప్రతిపక్షాల కంటే పొంగులేటే పెద్ద టార్గెట్‌ అయ్యారు. అయితే.. పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పీడ్‌ పెంచేకొద్దీ.. బీఆర్ఎస్‌ నేతలు కూడా దూకుడు పెంచుతున్నారు. దాంతో.. పొంగులేటి వర్గానికి.. బీఆర్ఎస్‌ నేతల మధ్య వార్‌ నడుస్తోంది. వాస్తవానికి.. మొన్నటివరకు కేసీఆర్‌ను టార్గెట్‌ చేసిన పొంగులేటి.. కొద్దిరోజుల నుంచి మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ లక్ష్యంగా విమర్శలు ఎక్కుపెడుతున్నారు. అటు.. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కూడా పొంగులేటిపై ఓ రేంజ్‌లో విరుచుకుపడుతున్నారు. కేసీఆర్‌పై ఏమాత్రం విమర్శలు చేసినా.. పువ్వాడ అజయ్‌ వెంటనే కౌంటర్‌ ఎటాక్‌ చేస్తున్నారు. దాంతో.. ఇప్పుడు ఖమ్మం పాలిటిక్స్‌ తెలంగాణ వ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారాయి.

ఇటీవల ఎన్టీఆర్‌ జయంతి రోజున పొంగులేటి వర్గానికి చెందిన ఓ నేతపై కొందరు దాడి చేసిన ఘటన తర్వాత ఖమ్మం రాజకీయాలు పీక్‌ స్టేజ్‌కు చేరాయి. ఆ దాడికి పువ్వాడే కారణమని పొంగులేటి వర్గం ఆరోపించడంతో అజయ్‌ వర్గం తెరపైకి వచ్చింది. మీడియా సమావేశం నిర్వహించిన ఖమ్మం బీఆర్ఎస్ నేతలు.. మంత్రి పువ్వాడ అజయ్‌పై పొంగులేటి వర్గం చేసిన ఆరోపణలను ఖండించారు.

పొంగులేటి అనుచరుడిపై దాడికి మంత్రికి ఎలాంటి సంబంధం లేదన్నారు ఖమ్మం బీఆర్ఎస్‌ అధ్యక్షులు పగడాల నాగరాజు. అయితే.. ఖమ్మం జిల్లాలో పువ్వాడకు అభిమానులు ఎక్కువ అని గుర్తు చేశారు. మంత్రి గురించి మాట్లాడేటపుడు జాగ్రత్తగా మాట్లాడాలని.. వ్యక్తిగత దూషణలకు దిగితే సహించేది లేదని వార్నింగ్‌ ఇచ్చారు బీఆర్ఎస్‌ నేతలు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..