Congress Party: పాతబస్తీలో ఉన్న సమస్యలపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు.. ఎంఐఎంకు పోటీగా హస్తం పార్టీ..

| Edited By: Srikar T

Jan 17, 2024 | 6:49 AM

తక్కువ మెజార్టీతో ఎంఐఎం గెలిచిన స్థానాలపై ఫోకస్‌ పెట్టింది కాంగ్రెస్‌ పార్టీ. అయితే ఇదే క్రమంలో తక్కువ మెజార్టీతో గెలిచిన స్థానాల్లో తమ పార్టీ బలోపేతం కోసం ఎంఐఎం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఉదయం నుంచి రాత్రి వరకు తక్కువ మెజార్టీతో గెలిచిన నియోజకవర్గాల్లోనే మకాం వేశారు అసదుద్దీన్‌ ఒవైసీ. పాతబస్తీలో కాంగ్రెస్‌ ఏర్పాటు చేసిన సమావేశంతో డైలామాలో పడింది ఎంఐఎం పార్టీ.

Congress Party: పాతబస్తీలో ఉన్న సమస్యలపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు.. ఎంఐఎంకు పోటీగా హస్తం పార్టీ..
Minister Ponnam Prabhakar
Follow us on

తక్కువ మెజార్టీతో ఎంఐఎం గెలిచిన స్థానాలపై ఫోకస్‌ పెట్టింది కాంగ్రెస్‌ పార్టీ. అయితే ఇదే క్రమంలో తక్కువ మెజార్టీతో గెలిచిన స్థానాల్లో తమ పార్టీ బలోపేతం కోసం ఎంఐఎం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఉదయం నుంచి రాత్రి వరకు తక్కువ మెజార్టీతో గెలిచిన నియోజకవర్గాల్లోనే మకాం వేశారు అసదుద్దీన్‌ ఒవైసీ. పాతబస్తీలో కాంగ్రెస్‌ ఏర్పాటు చేసిన సమావేశంతో డైలామాలో పడింది ఎంఐఎం పార్టీ. చాదర్‎ఘాట్‎లోని దివాన్ బాంకెట్ హల్‎లో ముస్లింల సమస్యలపై తహ్రిక్ ముస్లిం షబ్బన్ జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. అందులో ముఖ్య అతిధిగా ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ, హైదరాబాద్ ఇంచార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, సమావేశంలో పాల్గొన్న హైదరాబాద్ డీసీసీ అధ్యక్షులు సమీర్ ఉల్లాహ్, మలక్‌పేట అసెంబ్లీ ఇంచార్జ్ షేక్ మహమ్మద్ అక్బర్, సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్షులు అనిల్‌కుమార్ యాదవ్‌ తదితరులు హాజరయ్యారు.

ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీతో పాటు హైదరాబాద్ ఇంచార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను ముస్లిం షబ్బన్ జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షుడు తహ్రిక్ సత్కరించారు. హైదరాబాద్ ఇంచార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ హైదరాబాద్‌లో ఎమ్మెల్యేలు లేనందున నన్ను ఇంచార్జ్ మంత్రిగా ముఖ్యమంత్రి నియమించారన్నారు. ప్రజాపాలన ద్వారా దరఖాస్తులు స్వీకరించడం జరిగింది. హైదరాబాద్ అభివృద్ధి మీద కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రత్యేక పోకస్ పెట్టిందని వివరించారు. స్కూల్స్‌, హాస్పిటల్స్, నీటి సమస్యలు ఏవి ఉన్నా పోటీ చేసిన అభ్యర్థుల దృష్టికి తీసుకురండన్నారు.

హైదరాబాద్ ఏఐసీసీ ఇంచార్జ్‌గా దీపాదాస్ మున్షీ అనుభవం ఉన్న వ్యక్తి వారి నేతృత్వంలో మరింత ముందుకు వెళ్దామని దిశానిర్ధేశం చేశారు. కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రజా సమస్యలను ఇంచార్జ్‌ల ద్వారా తమ దృష్టికి తీసుకురండన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలు నెరవేరుస్తామని తెలిపారు. నెల రోజులు కూడా పూర్తి కాకముందే మీ హామీలు ఏమయ్యాయని కొందరు కాంగ్రెస్‎ను విమర్శిస్తున్నారు. అయితే 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఎన్ని హామీలు నెరవేర్చారని పొన్నం ప్రభాకర్ విమర్శించారు. డబుల్ బెడ్రూం ఏమయ్యాయి, ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వలేదు. తాము అధికారంలోకి వచ్చిన 24 గంటల్లోనే మహిళలకు ఉచిత బస్సు, ఆరోగ్య శ్రీ కింద 10 లక్షల వరకు చికిత్స అందిస్తున్నామని వివరించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రజా పాలన ద్వారా దరఖాస్తులు స్వీకరించాం. వాటి డేటా ఎంట్రీ జరుగుతుందని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..