Panchayat Elections: తెలంగాణలో మరో ఎన్నికల సమరం.. త్వరలోనే పంచాయతీ ఎన్నికలు..
తెలంగాణలో త్వరలో మరో ఎన్నికలు జరగబోతున్నాయి. అవే సర్పంచ్ ఎన్నికలు. దీనిపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక అప్‌డేట్ ఇచ్చారు. మీడియాతో మాట్లాడిన మంత్రి పొంగులేటి సంక్రాంతి నాటికి గ్రామాలకు కొత్త సర్పంచ్ లు వస్తారని పేర్కొన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ డిసెంబర్ నెలలోనే సర్పంచ్ ఎన్నికలకు ముహూర్తం ఫిక్స్ చేసినట్లు మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. వచ్చే సంక్రాంతి నాటికి గ్రామాలకు కొత్త సర్పంచ్ లు వస్తారని మీడియా చిట్ చాట్ లో వెల్లడించారు.. తెలంగాణలో ఈ ఏడాది ఫిబ్రవరితో సర్పంచ్‌ల పదవీ కాలం ముగిసింది. దీంతో ప్రభుత్వం స్పెషల్ ఆఫర్లను నియమించింది. దీంతో వారి ఆధ్వర్యంలోనే పల్లెల పాలన కొనసాగుతోంది. అయితే.. సర్పంచ్ ల పదవీకాలం ముగిసిన కొన్ని రోజులకే ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. గత రిజర్వేషన్లనే కొనసాగించాలని నిర్ణయించింది.
అయితే.. ఎన్నికలు ఆలస్యం అయి స్థానిక సంస్థలకు పాలకవర్గాలు లేకపోతే.. కేంద్రం నుంచి రావాల్సిన నిధులకు ఆటంకం ఏర్పడుతుందని ప్రభుత్వం భావించింది. అయితే.. పాత రిజర్వేషన్లతో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తే బీసీలు నష్టపోతారని ఆయా సంఘాల నేతలు ఆందోళనలు చేపట్టారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కులగణన నిర్వహించిన తర్వాతే పంచాయతీ ఎన్నికలు పెట్టాలని వారు డిమాండ్ చేశారు. దీంతో ప్రభుత్వం నిర్ణయం మార్చుకుంది.
వీడియో చూడండి..
కులగణన తర్వాతనే పంచాయతీ ఎన్నికలకు వెళ్తామని ప్రకటించింది. ఈ మేరకు ఈ నెల 6 నుంచి కులగణను నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తోంది. ఈ కులగణన నవంబర్ 30తో ముగియనుంది. ఆ రిపోర్ట్ ఆధారంగా స్థానిక ఎన్నికల రిజర్వేషన్లను ఖరారు చేసి స్థానిక ఎన్నికలను నిర్వహించనుంది రేవంత్ రెడ్డి సర్కార్. సర్పంచ్ ఎన్నికలకు ఇప్పటికే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్న అధికార కాంగ్రెస్ పార్టీ.. భారీ సంఖ్యలో తన అనుకూల వ్యక్తులను గెలిపించుకునే వ్యూహంలో ఉంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..