Global Summit: జర్మనీ వేదికగా న్యూస్9 గ్లోబల్ సమ్మిట్.. ప్రధాన మోదీ కీలక ప్రసంగం

Global Summit: జర్మనీ వేదికగా న్యూస్9 గ్లోబల్ సమ్మిట్.. ప్రధాన మోదీ కీలక ప్రసంగం

Ravi Kiran

| Edited By: Shaik Madar Saheb

Updated on: Nov 21, 2024 | 7:00 AM

ఢిల్లీలో వాట్‌ ఇండియా థింక్స్‌ థీమ్‌తో గ్లోబల్‌ సమ్మిట్‌ను నిర్వహించిన TV9 గ్రూప్‌కు చెందిన న్యూస్‌ 9 .. ఇప్పుడు జర్మనీ లోని స్టుట్‌గాట్‌ నగరం వేదికగా మరో అంతర్జాతీయ సదస్సును నిర్వహిస్తోంది. నవంబర్‌ 21 నుంచి 23వ తేదీ వరకు జరిగే సదస్సులో ప్రధాని మోదీ కూడా ప్రసంగిస్తారు. ఇలాంటి సదస్సును ఓ మీడియా సంస్థ నిర్వహించడం చారిత్రాత్మకమన్నారు TV9 నెట్‌వర్క్‌ ఎండీ బరుణ్‌దాస్‌

భారత్‌- జర్మనీ దేశాల మధ్య వాణిజ్య , ద్వైపాక్షిక, సాంస్కృతిక , క్రీడా సంబంధాలను బలోపేతంగా చేయడం లక్ష్యంగా TV9 గ్రూప్‌కు చెందిన న్యూస్‌ 9 ఆధ్వర్యంలో జర్మనీ లోని స్టుట్‌గాట్‌ ‌ నగరంలో ఇండియా-జర్మనీ గ్లోబల్‌ సమ్మిట్‌ను నిర్వహిస్తున్నారు. ఈనెల 21వ తేదీ నుంచి 23వ తేదీ వరకు MHP ఎరినాలో ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. ప్రధాని మోదీ కూడా సదస్సుకు హాజరవుతారు. ఇండియా-జర్మనీ గ్లోబల్‌ సమ్మిట్‌ సన్నాహక సమావేశం స్టుట్‌గార్ట్‌లో జరిగింది. TV9 నెట్‌వర్క్‌ ఎండీ బరుణ్‌దాస్‌ అధ్యక్షతన సమ్మిట్‌ సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. రెండు దేశాలకు చెందిన వివిధ రంగాల నిపుణులు , జర్నలిస్టులు ఈ సమావేశంలో తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ సదస్సు రెండు దేశాల సుస్థిరాభివృద్దికి దోహదం చేస్తుందన్నారు TV9 నెట్‌వర్క్‌ ఎండీ బరుణ్‌దాస్‌ .

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Published on: Nov 20, 2024 09:49 PM