Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: గంట కొట్టాలంటే ఒకలా.. గంట కొట్టేయాలంటే మరొకలా.. ఈ దొంగ రూటే సెపరేటు

AP News: గంట కొట్టాలంటే ఒకలా.. గంట కొట్టేయాలంటే మరొకలా.. ఈ దొంగ రూటే సెపరేటు

Nalluri Naresh

| Edited By: Ravi Kiran

Updated on: Nov 20, 2024 | 6:20 PM

గంట కొట్టాలంటే ఇలా..? గంట కొట్టేయాలంటే ఇలా చేయాలని బ్రహ్మానందానికి చెప్తాడు. సరిగ్గా అలాగే ఓ దొంగ గుళ్లో గంటలను భలే దొంగిలించాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది.

ఓ సినిమాలో బ్రహ్మానందం గంట దొంగతనం చేసి తీసుకెళ్తుండగా రాజేంద్రప్రసాద్ ఒక డైలాగ్ అంటాడు. గంట కొట్టాలంటే ఇలా..? గంట కొట్టేయాలంటే ఇలా చేయాలని బ్రహ్మానందానికి చెప్తాడు. సరిగ్గా అలాగే ఓ దొంగ గుళ్లో గంటలను భలే దొంగిలించాడు. అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలోని సాయిబాబా గుడిలోకి ఓ దొంగ భక్తుడిలా వచ్చి.. దొంగగా బయటకు వెళ్లాడు.

ఇది చదవండి: తెల్లారి వాకింగ్ చేస్తుండగా కనిపించిన నల్లటి బ్యాగ్.. తెరిచి చూడగా

సాయిబాబా ఆలయంలోకి భక్తుడిలా పంచ కట్టుకుని వచ్చి.. ఆలయ ప్రాంగణంలో కొద్దిసేపు గడిపి.. కాసేపటికి బాబా ముందు కూర్చున్నాడు. భక్తులెవరు గుడి లోపలికి రాని సమయం కోసం ఎదురు చూశాడు. ఇంకేముంది గుళ్లోకి ఎవరు రాని సమయంలో తన చేతివాటం ప్రదర్శించాడు. సాయిబాబాకు సంబంధించిన పంచలోహ విగ్రహం, వెండి చెంబు, గుళ్లో గంటలు చోరీ చేశాడు.

ఇది చదవండి: విశాఖలో ఉన్నట్టుండి వెనక్కి వెళ్లిన సముద్రం.. ఎన్ని మీటర్లో తెలిస్తే..

ఆ సినిమాలో రాజేంద్రప్రసాద్ చెప్పినట్లు శబ్దం రాకుండా గంటలు కొట్టేశాడు గానీ.. మనోడి చోరకళ మొత్తం అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డు అయింది. ఆలయంలో చోరీ జరిగిన విషయాన్ని గుర్తించిన పూజారి.. ఆలయ ధర్మకర్తలకు సమాచారం ఇచ్చాడు. ఆలయ ధర్మకర్తలు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో సీసీ ఫుటేజ్ పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని గుడి గంటల దొంగతనం చేసిన దొంగ కోసం గాలింపు చేపట్టారు.

ఇది చదవండి: బయట అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంటున్నారా..? తింటే ఇక పోతారు అంతే..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి