రూ.27 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి కేటీఆర్.. కాంగ్రెస్‌, బీజేపీలపై ఘాటు వ్యాఖ్యలు..

|

May 05, 2023 | 9:08 PM

ఆనాడు ఎప్పుడో నెహ్రు రాయేసి పోతే సీఎం కేసీఆర్ వ‌చ్చే దాకా కాలువ‌లు త‌వ్వుతానే ఉన్నార‌ని ఎద్దెవా చేశారు. కాళేశ్వ‌రం ప్రాజెక్టుకు శంకుస్థాప‌న చేసి ఎంత‌మంది అడ్డంక‌లు సృష్టించినా నాలుగేళ్ల‌ లోపు పూర్తి చేశామ‌ని చెప్పుకొచ్చారు.

రూ.27 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి కేటీఆర్.. కాంగ్రెస్‌, బీజేపీలపై ఘాటు వ్యాఖ్యలు..
Ktrs Visit To Husnabad
Follow us on

ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్‌లో పర్యటించారు. ఈ సందర్బంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. హుస్నాబాద్ పట్టణంలో రూ.2 కోట్ల నిధులతో నిర్మించిన ఇండోర్ స్టేడియం, రూ.2.25 కోట్లతో నిర్మించిన డిగ్రీకాలేజ్, రూ.1 కోటితో నిర్మించిన ఎస్టీ కాలేజ్ ఉమెన్స్ హాస్టల్, రూ.9.68 లక్షలతో నిర్మించిన టు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రారంభించారు. అదే విధంగా హుస్నాబాద్ పట్టణంలో రూ.2 కోట్లతో నిర్మించిన టీటీసీ కళాశాల బిల్డింగ్, రూ.13 లక్షలతో నిర్మించిన బస్తి ఆస్పత్రులను ప్రారంభించిన మంత్రి కేటీఆర్. హుస్నాబాద్ పట్టణంలో రూ. 1.55కొట్లలతో నిర్మించిన మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ లను ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ కుమార్‌, ఎమ్మెల్యే సతీశ్‌ పాల్గొన్నారు. అంతకు ముందు మంత్రి కేటీఆర్ కు సిద్దిపేట జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, హుస్నాబాద్ ఎమ్మెల్యే ఒడిదల సతీష్ కుమార్, ఎమ్మెల్సీ రమణ తదితరులు స్వాగతం ప‌లికారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీతో పాటు రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మంత్రి కేటీఆర్‌. ఇటు ఎంపీ బండిసంజయ్‌పైనా ధ్వజమెత్తారు కేటీఆర్. ఈ నాలుగున్నరేళ్లలో ఏం అభివృద్ధి పనులు చేశారో చెప్పే దమ్ముందా అంటూ బండికి సవాల్‌ విసిరారు కేటీఆర్. వచ్చే ఎన్నికల్లో బండిని ఇంటికి పంపాలంటూ పిలుపునిచ్చారు.

హుస్నాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గ‌తంలో దుర్భిక్షంతో కొట్టుమిట్టాడేద‌ని మంత్రి కేటీఆర్‌ గుర్తు చేశారు. క‌రువు నేల ఏద‌ని అడిగితే అంద‌రూ ఈ ప్రాంతమ‌ని చెప్పేవార‌న్నారు. ఆనాడు నెత్తురు పారిన‌, నెర్ర‌లు పారిన నెల ఇప్పుడు సీఎం కేసీఆర్ తీసుకున్న‌ రైతు సంక్షేమ కార్య‌క్ర‌మాల‌తో అభివృద్ధి జ‌రిగిన ఈ ప్రాంతాన్ని చూస్తుంటే ఎంతో సంతోష‌మైతున్నదన్నారు. ఆనాడు ఎప్పుడో నెహ్రు రాయేసి పోతే సీఎం కేసీఆర్ వ‌చ్చే దాకా కాలువ‌లు త‌వ్వుతానే ఉన్నార‌ని ఎద్దెవా చేశారు. కాళేశ్వ‌రం ప్రాజెక్టుకు శంకుస్థాప‌న చేసి ఎంత‌మంది అడ్డంక‌లు సృష్టించినా నాలుగేళ్ల‌ లోపు పూర్తి చేశామ‌ని చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

దేశంలో ఎవ‌రూ చేయ‌ని విధంగా 75 ఏండ్ల త‌ర్వాత కేసీఆర్ ఆడ‌బిడ్డ‌ల క‌ష్టాల‌ను తీర్చారని మంత్రి కేటీఆర్ చెప్నారు.. ఇంటింటికీ మంచినీళ్లు తీసుకొచ్చిన ఘ‌న‌త కేసీఆర్‌కే ద‌క్కుతుందన్నారు కేటీఆర్. 2014కు ముందు కాంగ్రెస్ ప్ర‌భుత్వ హ‌యాంలో 9 గంట‌ల క‌రెంట్ అని నరికి 6 గంట‌ల క‌రెంట్ ఇచ్చారు. అది కూడా స‌క్క‌గా ఇవ్వ‌ని ప‌రిస్థితి. కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో క‌రెంట్ వ‌స్తే వార్త‌.. ఇప్పుడు క‌రెంట్ పోతే వార్త అవుతుందని కేటీఆర్ పేర్కొన్నారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..