Jyothi Gadda |
Updated on: May 05, 2023 | 7:50 PM
పాత సీసాలలో అందమైన చిన్న మొక్కలను పెంచుకోవచ్చు. అలా మొక్కలతో ఇంటి కిటికీని టేబుల్‌పై ఉంచితే చూడటానికి బాగుంటుంది.
కుండీలు కొనడం, మొక్కలు పెంచడం వల్ల ఖర్చులు పెరుగుతాయి. కానీ పాత సీసాలు, పాత డబ్బాలు ఉపయోగిస్తే తక్కువ ఖర్చుతో ఇంటిని అందంగా అలంకరించుకోవచ్చు.
పాత సీసాలను ఇంటి అలంకరణకు కూడా ఉపయోగించవచ్చు. మీరు దానిపై లైట్లు వేసి బాటిళ్లను ప్రకాశవంతంగా మార్చేసుకోవచ్చు.
సీసాలలను వివిధ రంగుల నీటితో నింపుకుని, దాని చుట్టూ లైట్లు అమర్చుకుంటే మరింత అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తాయి.
పాత బాటిళ్లను శుభ్రం చేసుకుని వాటిపై మీకు ఇష్టమైన పెయింటింగ్ వేసుకుంటే కూడా బాగుంటుంది.
బాటిల్ పెయింటింగ్, బాటిల్ ప్లాంట్ పెంపకం వంటి వాటిపై ఆసక్తి ఉంటే ఒత్తిడి తగ్గుతుంది.
ఫ్రిడ్జ్‌లో వాటర్ బాటిల్ నుండి వంట నూనె పోయడం వరకు ప్లాస్టిక్ బాటిళ్లను చాలా రకాలుగా ఉపయోగించవచ్చు.