వామ్మో..ఇదేందక్కా.. అది కాలా.. కరెంటు తీగా..! దెబ్బకు గిన్నిస్ రికార్డ్ బ్రేక్ అయిందిగా..
కొంత మంది గెలుపు కోసం ఏం చేయడానికైనా సిద్ధపడతారు. ఫీట్ సాధించడానికి కొంతమంది ఎముకలు విరగ్గొట్టడం వింటే మీరు షాక్ అవుతారు. రెజ్లింగ్‌లో లేదా మరేదైనా మోటారు రేసింగ్‌లో పడి చేతులు విరిగిపోయిన వారు కొందరు ఉన్నారు. కానీ ఈ వ్యక్తి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చేరడానికి తన కాళ్లను గడియారం ముల్లులా రెండు విభిన్న దిశల్లో పెడుతోంది.
మనమంతా మన కాళ్ళను ముందుకు లేదా వెనుకకు స్వింగ్ చేస్తాము. కొద్దిగా సైడ్‌లకు కూడా వంచగలుగుతాము.. కానీ, కాళ్లను గడియారం ముళ్లులా వ్యతిరేక దిశలో తిప్పగలమా..? దాని గురించి ఆలోచిస్తేనే ఆశ్చర్యంగా ఉంది కదా..! కానీ, అమెరికాకు చెందిన ఓ మహిళ తన కాళ్లను క్లాక్ వర్క్ లాగా వేర్వేరు దిశల్లో ముందుకు వెనుకకు తిప్పి గిన్నిస్ రికార్డు సృష్టించింది. కొంత మంది గెలుపు కోసం ఏం చేయడానికైనా సిద్ధపడతారు. ఫీట్ సాధించడానికి కొంతమంది ఎముకలు విరగ్గొట్టడం వింటే మీరు షాక్ అవుతారు. రెజ్లింగ్‌లో లేదా మరేదైనా మోటారు రేసింగ్‌లో పడి చేతులు విరిగిపోయిన వారు కొందరు ఉన్నారు. కానీ ఈ వ్యక్తి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చేరడానికి తన కాళ్లను గడియారం ముల్లులా రెండు విభిన్న దిశల్లో పెడుతోంది.
ఈ ఫీట్ అందరినీ విస్మయానికి గురి చేసింది. కెల్సీ గ్రబ్ అనే మహిళ న్యూ మెక్సికోలోని అల్బుకెర్కీకి చెందిన నివాసి. ఆమె తన పాదాలను 171.4 డిగ్రీలు తిప్పి గిన్నిస్ రికార్డు సృష్టించింది. దీనిపై కెల్సీ విలేకరులతో మాట్లాడుతూ.. నేను లైబ్రరీలో పనిచేస్తున్నాను.. కొత్త ప్రపంచ రికార్డు పుస్తకం రాగానే నా సహోద్యోగి ఒకరు దాని వైపు చూస్తున్నారు.. ఓ మహిళ కాలు మెలితిప్పడం చూశాను.. అది చూసినప్పుడు నేను కూడా ఇలాంటివి చేయాలని అనుకున్నాను. అనుకున్నదే తడవుగా అలా నా పాదాలు తిప్పడం మొదలుపెట్టాను అంటూ వివరించింది.
కెల్సీ తన చీలమండను పూర్తి విరుద్ధంగా మార్చడానికి ప్రయత్నించింది. అది ఆమెకు ఎలాంటి బాధ కలిగించలేదని చెబుతుంటే వినడానికి ఆశ్చర్యంగా ఉంది. ఒక్కసారి ఆలోచించండి…మన చీలమండను అసాధారణంగా తిప్పితే ఎంత నొప్పి కలుగుతుందో కదా..? కానీ కెల్సీకి పెద్దగా నొప్పి కలగలేదు. అదే ఆమెను గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌కి కూడా తీసుకెళ్లింది.
కెస్లీకి ఐస్ స్కేటింగ్ అంటే మక్కువ. అది కూడా ఈ ఘనతకు దోహదపడింది. ప్రపంచంలో ఎంతమంది వింత మనుషులున్నారో చూడండి..కొంతమంది తమ ఆరోగ్యమే గొప్ప వరం అని అనుకుంటే, మరికొందరు ఇంకేదో సాహసం చేసి ఆరోగ్యాన్ని ఆపదలో పడేస్తుంటారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..