AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yadadri MMTS: యాదాద్రి వరకు ఎంఎంటీఎస్..!.. మంత్రి కేటీఆర్ ప్రకటనతో చిగురిస్తున్న ఆశలు..

తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా పునర్నిర్మితమైన యాదాద్రి ఆలయానికి భక్తుల రద్దీ విపరీతంగా పెరుగుతోంది. హైదరాబాద్ మహానగరం నుంచి కూతవేటు దూరంలోనే ఉన్న ఈ ఆలయం సమీపంలో రైలు మార్గం ఉన్నా...

Yadadri MMTS: యాదాద్రి వరకు ఎంఎంటీఎస్..!.. మంత్రి కేటీఆర్ ప్రకటనతో చిగురిస్తున్న ఆశలు..
Yadadri Mmts
Ganesh Mudavath
|

Updated on: Dec 01, 2022 | 10:15 AM

Share

తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా పునర్నిర్మితమైన యాదాద్రి ఆలయానికి భక్తుల రద్దీ విపరీతంగా పెరుగుతోంది. హైదరాబాద్ మహానగరం నుంచి కూతవేటు దూరంలోనే ఉన్న ఈ ఆలయం సమీపంలో రైలు మార్గం ఉన్నా సర్వీసులు లేకపోవడంతో స్వామి దర్శనానికి వచ్చే వారు ఇబ్బందులు పడుతున్నారు. నగరంలో సేవలందించే ఎంఎంటీఎస్ రైళ్లను యాదాద్రి ఆలయం వరకు పొడిగించాలన్న డిమాండ్లు వస్తున్నాయి. దీంతో గతంలోనే తక్కువ ఖర్చుతో ప్రయాణ వనరు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎంఎంటీఎస్‌ రెండోదశ పొడిగింపే సరైనదని భావించి, ప్రణాళికలు సిద్ధం చేసింది. అయినా క్షేత్రస్థాయిలో సాధ్యం కాలేదు. తాజాగా మంత్రి కేటీఆర్‌ ప్రకటనతో ఆశలు చిగురించాయి. సికింద్రాబాద్‌ నుంచి ఘట్‌కేసర్‌ వరకు 21 కిలోమీటర్ల మార్గంలో ఎంఎంటీఎస్‌ రెండో దశ రైల్వే లైను నిర్మిస్తున్నారు. ఘట్‌కేసర్‌ నుంచి యాదాద్రి వరకూ మరో 32 కిలోమీటర్లు ఉంటుంది. ఈ మార్గంలో రెండో దశ పనులను పొడిగిస్తే భక్తులు సులభంగా యాదాద్రికి వెళ్లొచ్చని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

అప్పట్లో రూ.330 కోట్లు అవుతుందని అంచనా వేశారు. తమ వాటాగా రైల్వే శాఖ రూ.110 కోట్లు సమకూర్చాల్సి ఉండగా.. రాష్ట్ర ప్రభుత్వం రెండు వాటాల కింద రూ.220 కోట్లు అందించాలి. రెండో దశ పూర్తయితే నగరం నుంచి రూ.15 టికెట్‌తో యాదాద్రి చేరుకునే అవకాశం లభిస్తుంది. ఇటీవల రూ.200 కోట్లు కేటాయిస్తామని పురపాలక మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. కాగా.. రాయగిరి రైల్వే స్టేషన్‌ పేరు యాదాద్రి రైల్వే స్టేషన్‌గా మారుస్తూ కేంద్ర ప్రభుత్వం గతంలో ఆదేశాలిచ్చింది. రైల్వే స్టేషన్‌కు పేరు మార్పుతో యాదాద్రి దేశ వ్యాప్తంగా ప్రాముఖ్యతను సంతరించుకుంది. 2016లో యాదాద్రి వరకు ఎంఎంటీఎస్‌ కేంద్రం మంజూరు చేసిన విషయం తెలిసిందే.

మరోవైపు.. ఫలక్‌నుమా – ఉందానగర్‌ మధ్య విద్యుదీకరణతో డబ్లింగ్‌ లైను పనులను పూర్తిచేసి అందుబాటులోకి వచ్చింది. ఈ పనులతో ఎంఎంటీఎస్ రెండో దశ పనులు చివరి దశకు చేరుకున్నాయి. హైదరాబాద్‌ – సికింద్రాబాద్‌ జంట నగరాల్లో అతి తక్కువ ఛార్జీలతో 17 ఏళ్లుగా ఎం‌ఎం‌టీఎస్‌ ప్రజలకు సేవలందిస్తోంది. 2003-04లో 48 సర్వీసులతో ఆరు కోచ్​లతో ఎంఎంటీఎస్ సేవలు ప్రారంభమయ్యాయి. మొదట్లో 13వేల మంది ఇందులో ప్రయాణించేవారు. 2011-12లో సర్వీసుల సంఖ్య 121కి పెంచగా ప్రయాణికుల సంఖ్య 1.25 లక్షలకు చేరుకుంది. ప్రస్తుతం 1.65లక్షల మంది వీటిలో తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. సబర్బన్‌ సర్వీసులను మరింత విస్తరించానే దృష్టితో ఎంఎం‌టీఎస్‌ రెండో దశ 84 కి.మీ వరకు విస్తరించాలని నిర్ణయించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..