Minister KTR: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జులై 8న తెలంగాణకు రానున్నారు. వరంగల్ పర్యటించనున్న ప్రధాని మోడీ.. కాజీపేటలో ఏర్పాటు చేయనున్న వ్యాగన్ మాన్యుఫ్యాక్చరింగ్ అండ్ పీరియాడిక్ ఓవర్‌హాలింగ్ (పీఓహెచ్) వర్క్‌షాప్, మెగా టెక్స్‌టైల్ పార్క్‌కు శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా జరగనున్న బహిరంగ సభలో మోడీ ప్రసంగించనున్నారు. దీనికోసం తెలంగాణ బీజేపీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. మోడీ వరంగల్ పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రశ్నలు సంధిస్తోంది. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీల సంగతేంటి.. అంటూ భారత్ రాష్ట్ర సమితి ప్రశ్నిస్తోంది. ఇచ్చిన మాట తప్పినందుకు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి మోదీ వరంగల్ రావాలంటూ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం పలు పశ్నలు సంధించారు.
ములుగులో ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు హామీ ఏమైందని ప్రశ్నిస్తున్నారు కేటీఆర్. యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామన్న కేంద్రం ప్రకటన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం.. ఇందుకోసం 360 ఎకరాలు కేటాయించింది. అయినా యూనివర్సిటీ ఏర్పాటు చేయలేదని రెండు రోజుల క్రితం మహబూబాబాద్ పర్యటనలో ఆందోళన వ్యక్తం చేశారు.
బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ హామీ ఏమైంది? కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ సంగతి ఏమైంది? కోచ్ ఫ్యాక్టరీ హామీ ఇచ్చి రిపేరంగ్ షెడ్ ఏర్పాటు చేస్తారా? అంటూ మోడీని మంత్రి కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..