Minister ktr: మూడు గంటల కరెంట్ కావాలా? మూడు పంటలు కావాలా? ప్రజలే తేల్చుకోవాలంటూ.. మంత్రి కేటీఆర్‌ పిలుపు

|

Jul 12, 2023 | 11:47 AM

పనిలో పనిగా అటు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును టార్గెట్‌ చేశారు మంత్రి కేటీఆర్‌. నాడు వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు మాటలు.. నేడు మూడుపూటల కరెంట్ దండగ అంటూ చోటా చంద్రబాబు అంటున్నాడని మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. తెలంగాణ రైతులు తేల్చుకోవాల్సిన తరుణం ఇదేనంటూ మంత్రి కేటీఆర్‌ ట్విట్‌ చేశారు.

Minister ktr: మూడు గంటల కరెంట్ కావాలా? మూడు పంటలు కావాలా? ప్రజలే తేల్చుకోవాలంటూ.. మంత్రి కేటీఆర్‌ పిలుపు
Minister KT Ramarao
Follow us on

ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నట్టు.. ఒకే ట్వీట్‌తో అటు బీజేపీ ఇటు కాంగ్రెస్‌లపై కౌంటర్ ఎటాక్‌కి దిగారు మంత్రి కేటీఆర్‌. కేసీఆర్‌ నినాదం మూడు పంటలు.. కాంగ్రెస్‌ విధానం మూడు గంటలు.. బీజేపీ విధానం మతం పేరిట మంటలు అంటూ ట్విట్టర్‌ వేదికగా మంత్రి కేటీఆర్‌ విమర్శనాస్త్రాలు సంధించారు. తెలంగాణ రాష్ట్రంలో ఉచిత కరెంట్‌పై కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా పెద్ద దుమారమే రేపాయి. రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా నేడు తెలంగాణ వ్యాప్తం ఆందోళనచేపట్టింది బీఆర్‌ఎస్‌. టీపీసీసీ రేవంత్ వ్యాఖ్యలను ఖండిస్తూ ఎక్కడికక్కడ కాంగ్రెస్‌ దిష్టిబొమ్మలు దహనం చేశారు.ఈ క్రమంలోనే రేవంత్ వ్యాఖ్యలకు కౌంటర్‌గా మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో ఘాటుగా స్పందించారు.

రాష్ట్రంలోని రైతులకు కరెంట్ ఇవ్వొద్దంటూ కాంగ్రెస్ పార్టీ మాటలను మంత్రి కేటీఆర్‌ సహా బీఆర్‌ఎస్‌ శ్రేణులు ఖండించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ధరణి తీసేస్తామని గతంలో రేవంత్ రెడ్డి చెప్పిన మాటలను మంత్రి కేటీఆర్‌ ప్రజలకు గుర్తు చేశారు. ఇప్పుడు రైతులకు 24గంటల కరెంట్‌ అవసరం లేదని, 3 గంటలు మాత్రం ఉంటే చాలు అంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. పనిలో పనిగా అటు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును టార్గెట్‌ చేశారు మంత్రి కేటీఆర్‌. నాడు వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు మాటలు.. నేడు మూడుపూటల కరెంట్ దండగ అంటూ చోటా చంద్రబాబు అంటున్నాడని మంత్రి కేటీఆర్‌ విమర్శించారు.

ఇవి కూడా చదవండి

తెలంగాణ రైతులు తేల్చుకోవాల్సిన తరుణం ఇదేనంటూ మంత్రి కేటీఆర్‌ ట్విట్‌ చేశారు. రైతును రాజును చేసే మనసున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కావాలా? లేకపోతే 3 గంటల కరెంట్ చాలన్న మోసకారి కావాలో తేల్చుకోవాలని ప్రజలకు సూచించారు మంత్రి కేటీఆర్.

రైతులకిస్తున్న ఉచిత విద్యుత్‌ విషయంలో అనుచిత వ్యాఖ్యలు చేసిన TPCC అధ్యక్షుడు, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌ రెడ్డి తక్షణమే తన పదవులకు రాజీనామా చేయాలని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి డిమాండ్‌ చేశారు. రైతు ద్రోహి రేవంత్‌ అని ఆరోపించారు. ఎన్నికలకు ముందు డబ్బలు అడుక్కునేందుకు అమెరికాకు వెళ్లారని విమర్శించారు. టీపీసీసీ అధ్యక్షుడు అయినంత మాత్రాన ఆయన సీఎం అయినట్టు మాట్లాడుతున్నారని మల్లారెడ్డి భగ్గుమన్నారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..