Minister KTR: ‘తప్పు జరిగితే బయటపెట్టండి’.. బీజేపీకి మంత్రి కేటీఆర్ సవాల్..

Minister KTR: తెలంగాణ ఐటీ మినిస్టర్ కేటీఆర్ ప్రతిపక్షాలపై ఏకధాటిగా విరుచుపడ్డారు. రాష్ట్రానికి వచ్చి నడ్డా అడ్డమైన మాటలు మాట్లాడుతున్నారని, తప్పులుంటే బయట పెట్టడంటూ బీజేపీ అధిష్టానానికి సవాల్ విసిరారు. టీవీ9 బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ కార్యక్రమంలో..

Minister KTR: ‘తప్పు జరిగితే బయటపెట్టండి’.. బీజేపీకి మంత్రి కేటీఆర్ సవాల్..
Minister KTR In TV9 Big News Big Debate

Updated on: Jun 27, 2023 | 8:36 PM

Minister KTR: తెలంగాణ ఐటీ మినిస్టర్ కేటీఆర్ ప్రతిపక్షాలపై ఏకధాటిగా విరుచుపడ్డారు. రాష్ట్రానికి వచ్చి నడ్డా అడ్డమైన మాటలు మాట్లాడుతున్నారని, తప్పులుంటే బయట పెట్టడంటూ బీజేపీ అధిష్టానానికి సవాల్ విసిరారు. టీవీ9 బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన ఈ విధంగా స్పందించారు. నాగర్‌కర్నూల్ వేదికగా సోమవారం జరిగిన నవ సంకల్ప సభలో బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడుతూ  ‘‘బీఆర్ఎస్ అంటే భ్రష్టాచార్ రాక్షసుల సమితి. జేబులు నింపుకోవడం కోసమే ధరణి, ఈ కుటుంబ పాలనతో రాష్ట్రం నష్టపోయింది’’ అన్నారు. వీటిపై స్పందించిన కేటీఆర్ ‘‘నడ్డా వచ్చి అడ్డమైన మాటలు మాట్లాడుతున్నారు. కేంద్ర పథకాన్ని దుర్వినియోగం చేస్తున్నాం అంటున్నారు. నిజంగా తప్పు జరిగి ఉంటే బయటపెట్టండి’’ అంటూ బీజేపీ అగ్రనాయకులపై మంత్రి కేటీఆర్ మండి పడ్డారు.

తెలంగాణ కాంగ్రెస్‌పై కూడా మంత్రి కేటీఆర్ విమర్శనాస్త్రాలు సంధిస్తూ.. ఆ పార్టీ విషయంలో బీజేపీని నిలదీశారు. ‘‘ఇక్కడ ఉండే కాంగ్రెస్ నేతలు ఎందుకు బీజేపీని తిట్టడం లేదు..? రాష్ట్ర కాంగ్రెస్ నేతలపై ఎందుకు దాడులు జరగవు..? కాంగ్రెస్‌ను ‘స్కాంగ్రెస్’ అంటారని దేశమంతా తెలుసు. మరి ఎందుకు వాళ్లపై ఎంక్వైరీ ఉండదు..? ఇక్కడి కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై ఎందుకు దాడులు జరగవు..? సోనియా, రాహుల్ గాంధీ మీద ఇంతవరకు కూడా ఎందుకు ఎంక్వైరీ జరగలేదు..?’’ అంటూ కేంద్ర బీజేపీ పెద్దలను కేటీఆర్ ప్రశ్నించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…