SLBC టన్నెల్ మిషన్ మరమత్తులపై మంత్రి కోమటిరెడ్డి ఫోకస్.. రాబిన్స్ కంపెనీ సీఈవోతో భేటీ

| Edited By: Balaraju Goud

Aug 13, 2024 | 8:09 AM

నల్లగొండ జిల్లా ప్రజల చిరకాల వాంఛ ఎస్ఎల్‌బీసీ టన్నెల్ పనులను రెండేళ్లలో పూర్తి చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. టన్నెల్ బోర్ మిషన్ బేరింగ్ తో పాటు ఇతర పరికరాలను వీలైనంత త్వరగా అందించాలని రాబిన్స్ కంపెనీ సీఈఓ లాక్ హోమ్ ను మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కోరారు.

SLBC టన్నెల్ మిషన్ మరమత్తులపై మంత్రి కోమటిరెడ్డి ఫోకస్.. రాబిన్స్ కంపెనీ సీఈవోతో భేటీ
Komatireddy Venkatreddy
Follow us on

నల్లగొండ జిల్లా ప్రజల చిరకాల వాంఛ ఎస్ఎల్‌బీసీ టన్నెల్ పనులను రెండేళ్లలో పూర్తి చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. టన్నెల్ బోర్ మిషన్ బేరింగ్ తో పాటు ఇతర పరికరాలను వీలైనంత త్వరగా అందించాలని రాబిన్స్ కంపెనీ సీఈఓ లాక్ హోమ్ ను మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కోరారు. అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒహయోలోని రాబిన్స్ టన్నెల్ బోరింగ్ మెషినరీ మ్యాన్ ఫ్యాక్చరింగ్ కంపెనీ సీఈఓ లాక్ హోం తో చర్చలు జరిపారు.

ఎస్ఎల్‌బీసీ టన్నెల్ తవ్వకానికి ఉపయోగించే అధునాతన నిర్మాణ మెషినరీని మంత్రి కోమటిరెడ్డికి చూపించారు రాబిన్స్ సీఈఓ లాక్ హోం. వాటి పనితీరు గురించి వివరించారు. SLBC ప్రాజెక్టు ప్రాధాన్యతను సీఈఓ లాక్ హోమ్ కు మంత్రి వివరించారు. SLBC టన్నెల్ తవ్వకానికి ఇబ్బందిగా మారిన బేరింగ్ తో పాటు ఇతర కటింగ్ స్పేర్ పార్ట్స్‌ను వీలైనంత త్వరగా సమకూర్చాలని రాబిన్స్ టన్నెల్ బోరింగ్ మెషినరీ మ్యాన్ ఫ్యాక్చరింగ్ కంపెనీ సీఈఓ లాక్ హోం కోరారు.

నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ రక్కసిని కట్టడి చేయడంతోపాటు, 4 లక్షల ఎకరాలకు సాగునీరు, హైదరాబాద్ నగర త్రాగునీటి అవసరాలు తీర్చేందుకు ఉద్దేశించిన ఎస్.ఎల్.బీ.సీ టన్నెల్ పనులను రాబోయే రెండేళ్లలో పూర్తి చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు. ఎస్ఎల్‌బీసీ టన్నెల్ పూర్తయితే 3 లక్షల ఎకరాలకు ఎలాంటి పంపింగ్ లేకుండా గ్రావిటీ ద్వారా నీరు అందుతుందని, బ్రహ్మణ వెల్లంల ప్రాజెక్టు ద్వారా మరో లక్ష ఎకరాలకు పంపింగ్ ద్వారా సాగునీరు అందుతుందని చెప్పారు.

గత పాలకుల నిర్లక్ష్యంతో ఎస్.ఎల్.బీ.సీ టన్నెల్ పనులు, బేరింగ్ తో పాటు ఇతర రిపేర్లతో ఆగిపోయాయని మంత్రి ధ్వజమెత్తారు. స్వయంగా ప్రభుత్వమే ప్రత్యేకంగా చొరవ తీసుకున్నందున బేరింగ్ తోపాటు ఇతర పరికరాలను వీలైనంత త్వరగా అందించాలని లాక్ హోమ్ ను మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కోరారు. ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసేందుకు.. తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ ఛానెల్ ద్వారా ప్రాజెక్టు పనులకు బిల్లులు చెల్లింపులు చేసేలా నిర్ణయం తీసుకున్నదని ఆయన చెప్పారు. బేరింగ్, ఇతర స్పేర్ పార్ట్స్ ను వీలైనంత త్వరగా సమకూరిస్తే.. తక్షణం చెల్లింపులు చేసేలా ఆదేశాలు జారీ చేస్తామని ఆయన వివరించారు.

మంత్రి వివరణతో సంతృప్తి వ్యక్తం చేసిన లాక్ హోం SLBC టన్నెల్ కు ప్రధాన బేరింగ్, ఇతర కటింగ్ స్పేర్ పార్ట్స్ ను అందించేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. రెండు నెలల్లో 7 డయామీటర్లు కలిగిన బేరింగ్, ఇతర స్పేర్ పార్ట్స్ ను షిప్ ద్వారా చెన్నైకి చేర్చుతామని లాక్ హోం తెలిపారు. మంత్రి కోమటిరెడ్డి వెంట నల్లగొండ ఇరిగేషన్ శాఖ సీఈ అజయ్ కుమార్, జైప్రకాశ్ అసోసియేట్ కంపెనీ డైరెక్టర్ పంకజ్ గౌర్ అన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..