Minister Kishan Reddy: అమరవీరుల కుటుంబానికి ఒక ఇల్లు ఇవ్వలేదు: తెలంగాణ ప్రభుత్వంపై మంత్రి కిషన్‌రెడ్డి కామెంట్స్‌

|

Jun 02, 2023 | 9:14 PM

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గోల్కొండ కోటలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి టీవీ9కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు..

Minister Kishan Reddy: అమరవీరుల కుటుంబానికి ఒక ఇల్లు ఇవ్వలేదు: తెలంగాణ ప్రభుత్వంపై మంత్రి కిషన్‌రెడ్డి కామెంట్స్‌
Minister Kishan Reddy
Follow us on

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గోల్కొండ కోటలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి టీవీ9కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు అమరవీరుల కుటుంబాలు ఎంతో బాధపడుతున్నాయని, ఆ కుటుంబాలకు ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్ల నిర్లక్ష్యం చేయకుండా ఎన్నో నిధులను ఇచ్చామని, కొత్త ప్రాజెక్టులు, సంక్షేమ పథకాల ఇచ్చామని, తాను మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అంకిత భావంతో పని చేసి కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు వచ్చేలా కృషి చేశానని అన్నారు. అన్ని శాఖల ద్వారా తెలంగాణ రాష్ట్రానికి న్యాయం చేశామన్నారు. అవకాశం ఉన్న ప్రతి చోటా రాష్ట్రానికి న్యాయం చేశామన్నారు.

ఇంత చేస్తున్నా.. ప్రధాని నరేంద్ర మోడీపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, కేంద్రం నుంచి ఎలాంటి నిధులు రావడం లేదని అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కేవలం రాజకీయ దురుద్దేశంతోనే ఈ ప్రచారం చేస్తున్నారన్నారు. తెలంగాణలో అనుకున్నంత పాలన జరగడం లేదని, ఈ ప్రభుత్వం ఒకే కుటుంబానికి ప్రరిమితమైందని విమర్శించారు. ప్రతి ఒక్కరు కూడా ఆ కుటుంబం మార్గంలో నడవాలని చూస్తున్నారని, వారి మోచేతి నీళ్లు తాగేలా చేస్తున్నారు తప్పా.. అభివృద్దేమి జరగలేదన్నారు.

రాష్ట్రంలో ప్రస్తుతం అందిస్తున్న గోదావరి నీళ్లు, కృష్ణ నీళ్లను గత ప్రభుత్వమే అందించిందని, అలాగే ఔటర్‌ రింగ్‌ రోడ్డు, మెట్రో వంటి సదుపాయాలు కూడా గత ప్రభుత్వమే చేసిందని, ఇప్పుడున్న ప్రభుత్వం చేసిందేమి లేదన్నారు. ప్రజలు ఆకాంక్షించినంత పాలన జరగడం లేదని, ఏ ఉద్యమ నేపథ్యంలో తెలంగాణ వచ్చిందో దానికే ఈ ప్రభుత్వం పూర్తిగా విరుద్దంగా పని చేస్తుందన్నారు.

ఇవి కూడా చదవండి


మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి