టీఎస్పీఎస్సీ పరీక్ష పేపర్ లీక్ కావడం ఇటీవల తెలంగాణలో దుమారం లేపింది. చాలారోజుల నుంచి ఉద్యోగాల నోటీఫికేషన్ల కోసం చూస్తున్న ఎంతోమంది నిరుద్యోగుల జీవితాలను దెబ్బ తీశారంటూ ప్రతిపక్ష పార్టీలు అధికార ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించాయి. ఈ పేపర్ లీక్ వ్యవహారం వెనుక పెద్ద తలకాయలు ఉన్నాయంటూ ఆరోపించాయి. ఇద్దరు చేసిన తప్పు వల్లే ఈ పేపర్ లీకైందంటూ మంత్రి కేటీఆర్ చెప్పినప్పటికీ.. దీనిపై సీబీఐ విచారణ చేయాలంటూ డిమాండ్ కూడా చేశాయి. అయితే ఇప్పుడు తాజాగా ఈ పేపర్ లీక్ వ్యవహారంపై మంత్రి హరీశ్ రావు స్పందించారు.
పేపర్ లీక్ ఘటన దురదృష్టకమని అలా జరగాల్సి ఉండకూడదన్నారు. పేపర్ లీకైతే వాటిని బయటపెట్టింది ప్రతిపక్షాలు కాదని మా ప్రభుత్వమే గుర్తించిందని తెలిపారు. ప్రస్తుతం నిందితులను జైల్లో వేసి కఠినంగా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. త్వరలోనే టీఎస్పీఎస్సీ పరీక్షలు పెట్టి నిరుద్యోగులుకు ఉద్యోగాలు ఇప్పిస్తామని వెల్లడించారు. ప్రతిపక్షాలు చెప్పే మాటలు నమ్మకూడదని సూచించారు. వారి మాటలు నమ్ముకుంటే కుక్క తోక పట్టి గోదావరిలో ఈదినట్లేనని విమర్శించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..