Harish Rao: అనాధ చిన్నారికి నామకరణం చేసిన మంత్రి హరీష్ రావు.. ఎవరూ లేకపోవడంతో తానే మేనమామగా..
Siddipet District: తల్లిదండ్రులు లేని చిన్నారిని అక్కున చేర్చుకొని, ఆ పాపకి నామకరణం చేశారు మంత్రి హారీష్ రావు. అమ్మానాన్న లేని అనాధలను అక్కున చేర్చుకొని వారి బాగోగులు చూసుకోవడానికి నిర్మాణం చేసిన సఖి కేంద్రాన్ని ప్రారంభం చేయడానికి వచ్చిన మంత్రి హరీష్ రావుకి ఓ మూడు నెలల పాప కనిపించింది. ఆ చిన్నారికి ఎవరూ లేకపోవడంతో..

సిద్ధిపేట జిల్లా, సెప్టెంబర్ 30: తల్లిదండ్రులు లేని చిన్నారిని అక్కున చేర్చుకొని, ఆ పాపకి నామకరణం చేశారు మంత్రి హారీష్ రావు. అమ్మానాన్న లేని అనాధలను అక్కున చేర్చుకొని వారి బాగోగులు చూసుకోవడానికి నిర్మాణం చేసిన సఖి కేంద్రాన్ని ప్రారంభం చేయడానికి వచ్చిన మంత్రి హరీష్ రావుకి ఓ మూడు నెలల పాప కనిపించింది. ఆ చిన్నారికి ఎవరూ లేకపోవడంతో.. మేనమామ స్థానంలో నిలబడి నామకరణం చేశాడు మంత్రి హరీష్ రావు. పేదరికంలో ఉన్న తన తల్లిదండ్రులు ఆ చిన్న పాపను అమ్మేయాలని, దాని ద్వారా తమ ఖర్చులు తీర్చుకోవాలని అనుకున్న సందర్భంలో శిశు గృహ అధికారులు ఆ తల్లి దగ్గర నుంచి అధికారికంగా ఆ బిడ్డను తీసుకొని చేర్పించి అలనా పాలన చూస్తున్నారు. అయితే పేదరికంలో పుట్టిన ఆ చిన్నారి పాపను ప్రభుత్వం అక్కున చేర్చుకుంది.
సిద్దిపేట జిల్లా కేంద్రంలో 30 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన శిశు గృహాన్ని శనివారం రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా తల్లిదండ్రుల ప్రేమ ఆప్యాయతలకు నోచుకోని అనాధ పిల్లలకు సేవ చేయడం ప్రజాప్రతినిధులుగా తమకు చాలా సంతృప్తిస్తుందని, అనాధ శిశువులు అందరినీ శిశు గృహ అధికారులు సొంత బిడ్డల్లాగా చూసుకోవాలని ఆయన కోరారు. అలా భవనాన్ని ప్రారంభించి ఆ శిశు గృహలో ఉన్న అనాధ శిష్యులను మంత్రి హరీష్ రావు పరిశీలిస్తున్న క్రమంలో మూడు నెలల వయసున్న చిన్నారి చిరునవ్వులు చిందిస్తూ అమాయకంగా శిశుగృహ ఆయాల చేతిలో ఆడుకుంటూ కనబడింది.
ఎదుటివారిని కట్టిపడేసేలా ఉన్న ఆ పాపను చూసి ఆ పాపను ఎత్తుకొని ముద్దు పెట్టుకున్నారు మంత్రి హరీష్ రాశు. ఎవరూ లేని ఆ పాపకు ఇంకా పేరు పెట్టకపోవడంతో తానే స్వయంగా మేనమామ స్థానంలో ఉండి, ఆ మూడు నెలల చిన్నారికి శ్రీజ అనే పేరు పెట్టారు. శ్రీజ ముఖంలో ఎప్పటికీ చిరునవ్వులు ఉండేలా, తల్లితండ్రులు లేని లోటు కనబడకుండా ఆనందంగా పెరిగి నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో జీవించేలా శిశుగ్రహ అధికారులు ఉన్నతంగా తీర్చిదిద్దాలని ఆయన ఆశీర్వదించారు.
కాగా, సిద్దిపేట అర్బన్ మండలం, బూరుగుపల్లి శివారులో ఓ నిరుపేద తల్లి 3 నెలల శ్రీజను విక్రయిస్తుండగా జిల్లా బాలల సంరక్షణ అధికారులు ఆమె నుంచి చిన్నారిని తీసుకొని లీగల్‌గా శిశు గృహలో చేర్పించి అలనా పాలన చూస్తున్నారు. ఇది తెలుసుకున్న మంత్రి హరీష్ రావు బాలల సంరక్షణ అధికారులను అభినందించారు. ఇదే విధంగా చిన్నారులను కంటిరెప్పలా కాపాడాలని ఆయన సదరు అధికారులను కోరారు.
