Crocodile: హైదరాబాద్ నడి బొడ్డున మొసలి ప్రత్యక్షం.. భయంతో పరుగులు తీసిన జనం.
నగరం నడిబొడ్డున మొసలి కలకలం రేపింది. సెప్టెంబర్ 27 బుధవారం సాయంత్రం నగరంలో వర్షం దంచి కొట్టింది. ఈ క్రమంలో రోడ్లు జలమయం అయ్యాయి. నాలాలు పొంగిపొర్లాయి. గంటపాటు కురిసిన భారీ వర్షానికి వాహనదారులు 3 గంటలపాటు నరకం చూసారు. అదేసమయంలో సందంట్లో సడేమియా అన్నట్టు రోడ్డుపై మొసలి పిల్ల ప్రత్యక్షమయింది. దానిని చూసి జనం భయంతో పరుగులు తీశారు. ఈ ఘటన ఖైరతాబాద్ లోని ఆనంద్ నగర్‌లో చోటుచేసుకుంది.
నగరం నడిబొడ్డున మొసలి కలకలం రేపింది. సెప్టెంబర్ 27 బుధవారం సాయంత్రం నగరంలో వర్షం దంచి కొట్టింది. ఈ క్రమంలో రోడ్లు జలమయం అయ్యాయి. నాలాలు పొంగిపొర్లాయి. గంటపాటు కురిసిన భారీ వర్షానికి వాహనదారులు 3 గంటలపాటు నరకం చూసారు. అదేసమయంలో సందంట్లో సడేమియా అన్నట్టు రోడ్డుపై మొసలి పిల్ల ప్రత్యక్షమయింది. దానిని చూసి జనం భయంతో పరుగులు తీశారు. ఈ ఘటన ఖైరతాబాద్ లోని ఆనంద్ నగర్‌లో చోటుచేసుకుంది. ఆనంద్‌నగర్ – చింతల్‌బస్తీ మధ్య కొత్తగా నిర్మిస్తున్న వంతెన వద్ద మొసలి పిల్ల ప్రత్యక్ష్యమైంది. భారీవర్షానికి బల్కాపూర్ నాలాలో వరద ఉధృతి పెరగడంతో కొట్టుకు వచ్చినట్లు భావిస్తున్నారు. నాలాలో మొసలిని చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మొసలిని పరిశీలించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అధికారులు వచ్చే లోపే మొసలి పక్కనే ఉన్న నాలాలోకి వెళ్లిపోయింది. గోడలు, మెటల్ రాడ్ల మధ్య ఇరుకైన మార్గంలో ఇరుక్కుపోయింది. రాత్రి 7 గంటలకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, అటవీశాఖ అధికారులు మొసలిని రెస్క్యూ చేసేందుకు చాలా సమయం పట్టింది. పోలీసు, అటవీ, DRF కి చెందిన దాదాపు 20 మంది అధికారుల బృందం మెటల్ రాడ్లను మధ్య ఉన్న మొసలిని బయటకు తీయడానికి శ్రమించారు. ఎట్టకేలకు మొసలిని పట్టుకొని జూకి తరలించారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..