Accident: రోడ్డు ప్రమాదానికి గురైన మంత్రి హరీష్ రావు కాన్వాయ్.. పలువురికి గాయాలు..

|

Jun 20, 2021 | 9:16 PM

Accident: మంత్రి హరీష్ రావుకు పెను ప్రమాదం తప్పింది. ఆదివారం నాడు సిద్దిపేట జిల్లా దుద్దెడ శివారులో మంత్రి వాహనానికి అడవి పంది..

Accident: రోడ్డు ప్రమాదానికి గురైన మంత్రి హరీష్ రావు కాన్వాయ్.. పలువురికి గాయాలు..
Harish Rao
Follow us on

Accident: మంత్రి హరీష్ రావుకు పెను ప్రమాదం తప్పింది. ఆదివారం నాడు సిద్దిపేట జిల్లా దుద్దెడ శివారులో మంత్రి వాహనానికి అడవి పంది అడ్డువొచ్చింది. దానిని తప్పించే క్రమంలో ఆయన కన్వాయ్‌లోని వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. కాన్వాయ్‌లోని పలు వాహనాలు తీవ్రంగా దెబ్బతినగా.. పలువురికి గాయాలయ్యాయి. మంత్రి హరీష్ రావు సేఫ్‌గా ఉన్నారు. ఆయన మరొక వాహనంలో హైదరాబాద్‌కు బయలుదేరారు.

అసలేం జరిగిందంటే.. ఆదివారం నాడు సిద్దిపేట నియోజకవర్గం పరిధిలో పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి కేసీఆర్ చేత ప్రారంభోత్సవం చేయించారు. ఆ కార్యక్రమాల్లో మంత్రి హరీష్ రావు కూడా పాల్గొన్నారు. అయితే, ఆ కార్యక్రమాలన్నీ ముగించుకుని మంత్రి హరీష్ రావు తన కాన్వాయ్‌లో హైదరాబాద్‌కు తిరుగు పయనం అయ్యారు. దుద్దెడ సమీపానికి చేరుకోగానే.. హరీష్ రావు కారుకు ముందు వెళ్తున్న కారుకు అడవి పంది అడ్డు వచ్చింది. దాంతో ముందున్న కారు సడన్ బ్రేక్ వేయడంతో హరీష్ రావు పైలట్ కారు ఢీకొట్టింది. ఆ వెంటనే హరీష్ రావు కారు పైలట్ వాహనాన్ని ఢీకొట్టింది. ఇలా ఒకదానికొటి హరీష్ రావు కాన్వాయ్ ఢీకొనడంతో కార్లన్నీ దాదాపు ధ్వంసం అయ్యాయి. కాన్వాయ్‌లో ముందు కారులో ఉన్న పలువురు సెక్యూరిటీ సిబ్బందికి గాయాలయ్యాయి. దాంతో వారిని హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తరలించారు. కాగా, మంత్రి హరీష్ రావుకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం అనంతరం మంత్రి హరీష్ రావు మరొక కారులో హైదరాబాద్‌కు బయలుదేరారు.

Accident Video:

Also read:

‘అంకుల్’ పశుపతితో ఇక నేరుగా పోరు…..చిరాగ్ పాశ్వాన్ నిర్ణయం…….త్వరలో బీహార్ లో భారీ రోడ్ షో