Arjun Ram Meghwal: వంద రూపాయలు రిలీజ్ చేస్తే రూ.15 కూడా చేరేది కాదు.. జియో ట్యాగింగ్‌తో అవినీతికి ప్రధాని మోదీ చెక్ పెట్టారన్న కేంద్ర మంత్రి

|

May 29, 2023 | 5:44 PM

గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం వంద రూపాయలు రిలీజ్ చేస్తే లబ్ధిదారుకు రూ.15 కూడా చేరేది కాదని.. దీంతో మోదీ ప్రభుత్వం ఈ విషయాన్ని గుర్తించిందన్నారు. అందుకే నేరుగా లబ్ధిదారుల ఖాతలో డబ్బులను జమచేయాలని నిర్ణయించిందన్నారు.

Arjun Ram Meghwal: వంద రూపాయలు రిలీజ్ చేస్తే రూ.15 కూడా చేరేది కాదు.. జియో ట్యాగింగ్‌తో అవినీతికి ప్రధాని మోదీ చెక్ పెట్టారన్న కేంద్ర మంత్రి
Arjun Ram Meghwal
Follow us on

మోదీ పాలనలో అవినీతికి తావు లేదని అన్నారు కేంద్ర మంత్రి అర్జున్ రామ్‌ మేఘవాల్. మోదీ పాలన తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్‌ మాదాపూర్‌లోని దసపల్లా హోటల్‌లో ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం వంద రూపాయలు రిలీజ్ చేస్తే లబ్ధిదారుకు రూ.15 కూడా చేరేది కాదని.. దీంతో మోదీ ప్రభుత్వం ఈ విషయాన్ని గుర్తించిందన్నారు. అందుకే నేరుగా లబ్ధిదారుల ఖాతలో డబ్బులను జమచేయాలని నిర్ణయించిందన్నారు. కాంగ్రెస్ హయాంలో ఇందిరమ్మ గృహాలను నిర్వహించిన సందర్భంలో ఇదే జరిగేదని అన్నారు. కానీ అధికారులు, రాజకీయ నేతల మధ్య ఎందరికి అందాయో తెలియదన్నారు.

మోడీ ప్రధాని వచ్చిన తర్వాత ఇండ్ల నిర్మాణాలకు జియో ట్యాగింగ్ చేయడంతో నేరుగా లబ్ధిదారుకు ఫలాలు అందున్నాయని అన్నారు. 2047 టార్గెట్‌ విజన్‌తో ప్రధాని మోదీ పనిచేస్తున్నారని అన్నారు. భారత దేశ వికాసానికి ప్రధాని మోదీ కృషిచేస్తున్నారని స్పష్టం చేశారు. 2047 నాటికి దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు ప్రధాని మోదీ కృషిచేస్తున్నారు. కాంగ్రెస్ హయాంలో ఇండ్లు నిర్మిస్తామని చెప్పేది.. కానీ నిర్మించేవారు కాదన్నారు. కానీ మోదీ పాలనలో 3.5 కోట్లకు పైగా ఇండ్లు నిర్మించామని గుర్తు చేశారు. వీటితోపాటు దేశ వ్యాప్తంగా 11.72 కోట్ల టాయిలెట్లు నిర్మించామన్నారు.

స్వచ్ఛ భారత్‌లో భాగంగా ప్రధాని మోదీ స్వయంగా చీపురు పట్టుకుని క్లీనింగ్ మొదలు పెట్టారని అన్నారు. దేశంలోని రైల్వే స్టేషన్లు అధునాతనంగా తీర్చిదిద్దామన్నారు. గతంలో దుర్గంధభరితంగా ఉండేవన్నారు. దేశవ్యాప్తంగా జన్ ఔషధి మెడికల్ స్టోర్లు ఏర్పాటు చేశామన్నారు.. పాండిచ్చేరిలోనూ ఇలాంటివి తీసుకొచ్చామన్నారు. అది చూసి అక్కడి ప్రజలు ‘మెడిసిన్’ కోరుకోవడం లేదరి.. ‘మోడీసన్’ కావాలనుకుంటున్నారని అభివర్ణించారు కేంద్ర మంత్రి అర్జున్ రామ్‌ మేఘవాల్.

మరిన్ని జాతీయ వార్తల కోసం