మజ్లీస్ ఎంపీ అసదుద్ధీన్ ఒవైసీ బీజేపీ నేతలపై మండిపడ్డారు. హైకోర్టు ఇచ్చిన బెయిల్ కండీషన్లను పదే పదే ఉల్లంఘించిన ఎమ్మెల్యే రాజా సింగ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజాసింగ్ కు బెయిల్ రద్దు చేయాలని డీజీపీ హైకోర్టులో పిటీషన్ వేయాలని కోరారు. అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై కూడా అసదుద్దిన్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పాతబస్తీలో రంజాన్ సందర్భంగా అర్ధరాత్రి కూడా దుకణాలు తెరవడానికి అనుమతి ఇవ్వడాన్ని బండ్ సంజయ్ తప్పుబట్టడంపై మండిపడ్డారు. ఆయన హోదాకు తగ్గట్లు మాట్లాడటం లేదని విమర్శించారు.
అలాగే వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిలతో ఎట్టిపరిస్థితుల్లో సమావేశం అయ్యే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఆమె పార్టీతో ఎలాంటి చర్చలు ఉండవని పేర్కొన్నారు. అలాగే గ్రూప్ 1 పేపర్ లీక్ కావడం దురదృష్టకరమన్నారు. అభ్యర్థులుకు వెంటనే ప్రభుత్వం న్యాయం చేయాలని కోరారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం..