AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Medak: రూ.20 వేల కోసం ఇంటికి వచ్చి సూటిపోటి మాటలు.. భరించలేక..

మైక్రో ఫైనాన్స్ ఏజెంట్ల వేధింపులు మరో ప్రాణం తీసాయి. మెదక్ జిల్లా తూప్రాన్‌లోని వరలక్ష్మి తీవ్ర ఒత్తిళ్లు, అవమానాలు తట్టుకోలేక చెరువులో దూకి ప్రాణాలు తీసుకుంది. దీంతో బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు. రూ.20 వేల బాకీ కోసం వరలక్ష్మిని ఏజెంట్లు సూటిపోటి మాటలు అన్నారని వారు చెబుతున్నారు.

Medak: రూ.20 వేల కోసం ఇంటికి వచ్చి సూటిపోటి మాటలు.. భరించలేక..
Varalakshmi
P Shivteja
| Edited By: |

Updated on: Nov 23, 2025 | 6:56 PM

Share

మైక్రో ఫైనాన్స్ నిర్వహకులు ఆగడాలు శృతిమించుతున్నాయి. వీళ్ల వేధింపులకు అడ్డూఅదుపు లేకుండా పోతుంది. అధిక వడ్డీలకు డబ్బులు ఇవ్వడం.. అవి కట్టాలని తీసుకున్న వారిపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేయడం..అప్పు తీసుకున్న వారి ఇంటి వద్దకు వెళ్లి నానా హంగామా చేయడంతో.. అవమాన భారం భరించలేక కొంతమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు..ఇలాంటి ఘటనే తాజాగా మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది.. తూప్రాన్ పట్టణంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన వరలక్ష్మి అనే మహిళ నవంబర్ 23, ఆదివారం స్థానిక పెద్ద చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆమె మైక్రో ఫైనాన్స్ వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్లు మృతురాలు బంధువులు తెలిపారు..మేడ్చల్ లోని ఫైవ్ స్టార్ అనే మైక్రో ఫైనాన్స్ నుండి నాలుగు లక్షలు,తూప్రాన్ పట్టణంలోని క్రిష్ బ్యాంక్ మైక్రో ఫైనాన్స్ నుంచి 80 వేల రూపాయలు అప్పు తీసుకుందని. అయితే ఆదివారం ఉదయం క్రిష్ ఫైనాన్స్‌కి చెందిన ఏజెంట్లు వరలక్ష్మి ఇంటి వద్దకు వచ్చి బకాయి ఉన్న 20,000 రూపాయలు వెంటనే చెల్లించాలని ఒత్తిడి చేస్తూ,ఇష్టం వచ్చినట్లు మాట్లాడడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురైంది. దీంతో చెరువులో దూకి తనువు చాలించింది.

గత కొద్దిరోజులుగా ప్రతిసారి ఇంటి వద్దకు ఫైనాన్స్ ఏజెంట్లు రావడం.. డబ్బుల కోసం తీవ్రంగా ఒత్తిడి చేసేవారని..  అందుకే బలవ్మరణానికి పాల్పడిందని బంధువులు కన్నీటి పర్యంతం అయ్యారు. వరలక్ష్మీ బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us
కట్ చేసిన నిమ్మకాయలను ఇలా స్టోర్ చేస్తే.. వారమైనా చెడిపోవు
కట్ చేసిన నిమ్మకాయలను ఇలా స్టోర్ చేస్తే.. వారమైనా చెడిపోవు
మొదట్లో స్లో.. చివర్లో ఫుల్ స్పీడ్.. భారత్ గోల్డ్ బాక్స్ ఫుల్
మొదట్లో స్లో.. చివర్లో ఫుల్ స్పీడ్.. భారత్ గోల్డ్ బాక్స్ ఫుల్
చిన్నపిల్లని పెళ్లి చేసుకున్నా.. అందుకే ఇలా..
చిన్నపిల్లని పెళ్లి చేసుకున్నా.. అందుకే ఇలా..
దోశ పిండి పల్చగా మారిందా.. టెన్షనొద్దు.. ఈ సింపుల్ చిట్కాలతో
దోశ పిండి పల్చగా మారిందా.. టెన్షనొద్దు.. ఈ సింపుల్ చిట్కాలతో
తెలంగాణ ఓటర్లకు ECI గుడ్‌న్యూస్! నోటీసుల గందరగోళం,స్పెషల్ డ్రైవ్
తెలంగాణ ఓటర్లకు ECI గుడ్‌న్యూస్! నోటీసుల గందరగోళం,స్పెషల్ డ్రైవ్
చార్ట్ ప్రిపరేషన్ తర్వాత కూడా కన్ఫర్మ్ టికెట్ పొందొచ్చని తెలుసా?
చార్ట్ ప్రిపరేషన్ తర్వాత కూడా కన్ఫర్మ్ టికెట్ పొందొచ్చని తెలుసా?
చుండ్రు పదేపదే వస్తుందా? ఈ తప్పులే అసలు కారణం..
చుండ్రు పదేపదే వస్తుందా? ఈ తప్పులే అసలు కారణం..
ఆ హీరోకు చీరాల బీచ్‏లో రిసార్ట్.. ఇప్పుడు వందల కోట్ల ఆస్తి..
ఆ హీరోకు చీరాల బీచ్‏లో రిసార్ట్.. ఇప్పుడు వందల కోట్ల ఆస్తి..
ఈ ప్రాంతాల్లో రాబోయే 36 గంటల పాటు తాగునీటి సరఫరా బంద్!
ఈ ప్రాంతాల్లో రాబోయే 36 గంటల పాటు తాగునీటి సరఫరా బంద్!
డీమార్ట్‌‌తో బిజినెస్ డీల్.. మీ వస్తువులను అమ్మి లక్షలు..
డీమార్ట్‌‌తో బిజినెస్ డీల్.. మీ వస్తువులను అమ్మి లక్షలు..