తెలంగాణ రాష్ట్రంలో రానున్న కొన్ని రోజుల పాటు పలు చోట్ల చిరుజల్లులు కురిసే అవకావం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. గత కొన్ని రోజులగా రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతల స్థాయిలు పెరుగుతున్న విషయం తెలిసిందే. ఎంత వేడిమికి తాలలేక ప్రజలు ఇల్ల నుంచి బయటికి రాలేని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో బానుడి భగభగల నుంచి ఉపశమనం లభించనున్నట్లు వాతావారణ విభాగం అధికారులు తెలిపారు. ఛత్తీస్‌గఢ్ నుంచి విదర్భ, తెలంగాణ మీదుగా కర్ణాటక వరకు ద్రోణి ఏర్పడినట్లు తాజాగా వాతావరణ వాతావరణ శాఖ తెల్పింది. దీని ప్రభావం వల్ల దేశంలోని తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి తెలంగాణ రాష్ట్రంలోకి గత రెండు, మూడు రోజులుగా దిగువ స్థాయి గాలులు వీస్తున్నాయి. వాతావరణంలో కూడా పలు మార్పులు చోటుచేసుకున్నాయి. ఎండ వేడి తీవ్రత తగ్గి, చల్లని గాలులు వీస్తున్నాయి.
దీంతో మార్చి 20వ తేదీ వరకు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా తక్కువగా నమోదయ్యే అవకాశాలున్నట్లు అధికారులు తెలియజేశారు. మరోవైపు శనివారం గరిష్ఠ ఉష్ణోగ్రతలన్నీ సాధారణం కన్నా తక్కువగా నమోదయ్యాయి. హైదరాబాద్‌లో సాధారణం కన్నా 2.6 డిగ్రీలు తక్కువగా 32.7 డిగ్రీల సెల్సియస్ నమోదయింది. ఇక ఈ నెల 16వ తేదీ అనంతరం పలు జిల్లాల్లో చిరు జల్లులు కురవనున్నట్లు అధికారులు సూచిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.