Telangana: నరకానికి కేరాఫ్ అడ్రస్.. ఆ రహదారుల మరమ్మత్తుకు నోచుకోని సర్కార్..
రెండు తెలుగు రాష్ట్రల్లో ఆ రోడ్డుకు ఒక ప్రత్యేకత ఉంది. 50 కిలోమీటర్ల మేర ఒక్క మూలమలుపు కూడా ఆ రోడ్డుపై కనిపించదు. ఆ రోడ్డుపై ప్రయాణం అంటేనే ఒకప్పుడు సాఫీగా సాగిపోయేది. అలాంటి ప్రత్యేకత ఉన్న రోడ్డు ఇప్పుడు పూర్తిగా శిథిలావస్థకు చేరింది. సంగారెడ్డి జిల్లా అందోలు నియోజకవర్గం పరిధిలో ఈ అంతర్ రాష్ట్ర రహదారి చాలా ఫెమస్. అల్లదుర్గ్ ఐబీ చౌరస్తా నుండి మెటల్‌కుంట వరకు 50 కిలో మీటర్ల ఉన్న ఈ రోడ్డుపై ఒక్క ములమలుపు కూడా లేకుండా నిర్మాణం చేపట్టారు. దీన్ని చూడడానికి కూడా అప్పట్లో చాలామంది వచ్చేవారు. కానీ ఇప్పుడు సీన్ మారింది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆ రోడ్డుకు ఒక ప్రత్యేకత ఉంది. 50 కిలోమీటర్ల మేర ఒక్క మూలమలుపు కూడా ఆ రోడ్డుపై కనిపించదు. ఆ రోడ్డుపై ప్రయాణం అంటేనే ఒకప్పుడు సాఫీగా సాగిపోయేది. అలాంటి ప్రత్యేకత ఉన్న రోడ్డు ఇప్పుడు పూర్తిగా శిథిలావస్థకు చేరింది. సంగారెడ్డి జిల్లా అందోలు నియోజకవర్గం పరిధిలో ఈ అంతర్ రాష్ట్ర రహదారి చాలా ఫెమస్. అల్లదుర్గ్ ఐబీ చౌరస్తా నుండి మెటల్‌కుంట వరకు 50 కిలో మీటర్ల ఉన్న ఈ రోడ్డుపై ఒక్క ములమలుపు కూడా లేకుండా నిర్మాణం చేపట్టారు. దీన్ని చూడడానికి కూడా అప్పట్లో చాలామంది వచ్చేవారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. ప్రస్తుతం ఈ రోడ్డు పేరు చెబితేనే వణికిపోతున్నారు ప్రయాణికులు. ఈ అంతర్ రాష్ట్ర రహదారి పూర్తిగా ఛిద్రమైంది. 45 కి.మీ.ల మేర రోడ్డుపై అడుగుకో గుంత కనిపిస్తుంది. రాళ్లు, కంకర తేలి నరకం కనిపిస్తుంది. వర్షాలకు గోతుల్లో నీరు చేరడడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నియోజకవర్గంలోని అల్లాదుర్గం మండలం చిల్వెర చౌరస్తా నుంచి మెటల్‌కుంట మధ్య 161 జాతీయ రహదారిని ముంబై హైవేతో కలుపుతూ ఈ అంతర్‌రాష్ట్ర రహదారి నిర్మించారు. ఈ రోడ్డు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దులను కలుపుతుంది. రాష్ట్రంలో మెదక్, కామారెడ్డి, సిద్దిపేట జిల్లాలను ఉత్తర తెలంగాణతో అనుసంధానం చేస్తుంది. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయనున్న ‘నిమ్జ్’ను కూడా ఉత్తర తెలంగాణ జిల్లాలతో అనుసంధానం చేసే ఏకైక రహదారి కూడా ఇదే.
ఇక నియోజకవర్గంలోని అల్లాదుర్గం, వట్‌పల్లి, రేగోడ్, మునిపల్లి, రాయికోడ్‌తోపాటు, నారాయణఖేడ్, జహీరాబాద్ నియోజకవర్గాల్లోని పలు మండలాలకు చెందిన ప్రజలు, వ్యాపార, వాణిజ్య, విద్య, వైద్య, బంధుత్వ అవసరాల కోసం ప్రతీ నిత్యం ఈ రహదారి గుండా రాకపోకలు సాగిస్తుంటారు. ఇంత ప్రాధాన్యమున్న రహదారి ఐదారేళ్లుగా ఛిద్రమైంది. రహదారికి మరమ్మతులు అటుంచి కనీసం గుంతలను మట్టితో పూడ్చడం లాంటి కనీస నిర్వహణ కూడా రహదారులు భవనాల శాఖ చేపట్టడం లేదు. చిల్వెర చౌరస్తా నుంచి మెటల్‌కుంట వరకు ఉన్న ఈ రోడ్డులో సుమారు 40 కిలోమీటర్ల రోడ్డు పూర్తిగా దెబ్బతిన్నది. ప్రతి అడుగుకు ఒక గుంతలు ఏర్పడింది. ముఖ్యంగా చేవెళ్ల, మేడికుంద, దేవునూర్ గేట్, పోతులబొగుడ గేట్, బహిరన్‌దిబ్బ, వట్‌పల్లి వద్ద భారీ గుంతలు ఏర్పడి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతున్నది. గుంతల్లో నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ప్రాణాలు అరచేతి పెట్టుకుని ప్రయాణిస్తున్నారు. రోడ్డుపైన ఏర్పడ్డ గుంతల్లో వాహనాలు నడపడం వల్ల నిత్యం వాహనాల సామగ్రి విరిగిపోతున్నాయి. ఈ రోడ్డుపైన ఒక్కసారి నడిచిన వాహనం మరుసటి రోజు షేడ్డ్కు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని వాహనదారులు మొత్తుకుంటున్నారు.
ఇక ఇదే రోడ్డు గుండా ఉన్న రాయికోడ్ మండలం సిరూర్ గ్రామ శివారులోని రాయిపల్లి బ్రిడ్జి ఆవల గట్టు నుంచి మహబత్‌పూర్ శివారు వరకు గల సుమారు నాలుగు కిలోమీటర్ల రహదారి ఆనవాళ్లు కనిపించనంతగా ధ్వంసమైంది. అడుగడుగునా గుంతలు ఏర్పడ్డాయి. కాగా ఈగుంతల్లో అప్పుడప్పుడు ఆర్‌ఆండ్‌బీ అధికారులు మొరం వేసి తాత్కాలికంగా మరమ్మతులు చేసి మమ అనిపిస్తున్నారు. దీంతో చిన్నిపాటి వర్షానికే తాత్కాలికంగా వేసిన మట్టి బురదగా మారి వాహనదారులు అదుపు తప్పి పడిపోతున్నారు. ఈ రోడ్డు అధ్వాన్నంగా ఉండడంతో లారీ, కారు డ్రైవర్లు చిల్వెర జోగిపేట- సంగారెడ్డి-జహీరాబాద్ మీదుగా ప్రయాణిస్తున్నారు. దీంతో సుమారు 100 కి.మీల మేర అదనంగ ప్రయాణించాల్సి వస్తుదని చెబుతున్నారు. ఈ రహదారి మంజీరా నది మీదుగా వెళ్తుండడంతో వట్‌పల్లి మండలం గట్టుపల్లి, రాయికోడ్ మండలం సిరూర్ గ్రామాల మధ్య వంతెన నిర్మించారు. కాగా ఈ వంతెనకు ఒక పక్క రెయిలింగ్ విరిగిపోయినా.. ఇప్పటికి ఎవరూ పట్టించుకోవడం లేదు. వాహనదారుడు అదపుతప్పితే నేరుగా సింగూరు బ్యాక్ వాటర్ ఉన్న మంజీరా నదిలో పడే ప్రమాదముంది. ఎన్నో ఏళ్లుగా ఈ రోడ్డు శిథిలావస్థకు చేరినప్పటికీ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని, ఇప్పటికైనా సర్కార్ స్పందించి ఈ రోడ్డుపై మరమ్మత్తులు చేయాలని కోరుతున్నారు వాహనదారులు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..