Hyderabad: రెచ్చిపోతున్న మందుబాబులు.. 10 రోజుల్లో ఎన్ని డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయంటే..
ఎన్నిసార్లు చెప్పినా వినడం లేదు. జైలు శిక్ష వేసినా తగ్గడం లేదు. అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా.. బుర్రకి ఎక్కించుకోవడం లేదు. ఇప్పుడు చెప్పేది మందుబాబుల గురించి. పీకల వరకూ తాగడం.. అదే కిక్కుతో వాహనాలు నడపడం హైదరాబాద్‌లో కామన్ అయిపోయింది. ప్రమాదాలు జరుగుతున్నాయని మీడియాలో ఎన్ని వార్తలు వస్తున్నా.. భయం, భక్తి లేకుండా ప్రవర్తిస్తున్నారు. జూలై 1నుంచి జూలై 10 వరకు.. అంటే జస్ట్ పది రోజుల వ్యవధిలో సిటీ వ్యాప్తంగా నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పెద్ద సంఖ్యలో మందుబాబులు పట్టుబడ్డారు.
ఎన్నిసార్లు చెప్పినా వినడం లేదు. జైలు శిక్ష వేసినా తగ్గడం లేదు. అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా.. బుర్రకి ఎక్కించుకోవడం లేదు. ఇప్పుడు చెప్పేది మందుబాబుల గురించి. పీకల వరకూ తాగడం.. అదే కిక్కుతో వాహనాలు నడపడం హైదరాబాద్‌లో కామన్ అయిపోయింది. ప్రమాదాలు జరుగుతున్నాయని మీడియాలో ఎన్ని వార్తలు వస్తున్నా.. భయం, భక్తి లేకుండా ప్రవర్తిస్తున్నారు. జూలై 1నుంచి జూలై 10 వరకు.. అంటే జస్ట్ పది రోజుల వ్యవధిలో సిటీ వ్యాప్తంగా నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పెద్ద సంఖ్యలో మందుబాబులు పట్టుబడ్డారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన 1,614 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి కేసుల్లో కోర్టువరకూ వెళ్లి ఛార్జ్ షీట్లు దాఖలైనవి 992 ఉన్నాయి. వీరిలో 55 మందికి 15 రోజుల జైలు శిక్ష వేశారు న్యాయమూర్తులు. ఎనిమిది మంది డ్రైవింగ్ లైసెన్సులు రద్దు చేశారు. కాగా తాగి వెహికల్స్ నడిపిన మందుబాబుల నుంచి 21 లక్షల 36 వేల రూపాయల ఫైన్ వసూలు చేశారు పోలీసులు.
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికే వాహనాల్లో ఎక్కువగా బైక్స్ ఉంటున్నాయని పోలీసులు చెబుతున్నారు. అదే పనిగా డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 2 సార్లకు మించి దొరికితే శాశ్వతంగా డ్రైవింగ్ లైసెన్సులు రద్దు చేస్తామని.. పోలీసుల వార్నింగ్ ఇస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం వల్ల.. అమాయకులు ప్రాణాలు పోతున్నాయని. ఇలాంటివారిని అస్సలు ఉపేక్షించేది లేదన్నారు పోలీసులు. మరోవైపు రాంగ్ రూట్‌లో వాహనాలు నడపడం వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నట్లు గుర్తించిన పోలీసులు.. అలాంటివారిపై కేసులు బుక్ చేసేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేస్తే.. ఇంతకు ముందులా ఫైన్స్ వేసి వదిలేయడం ఉండదని.. కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..