Meenakshi Natarajan: తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్‌ఛార్జ్‌గా మీనాక్షి నటరాజన్..
కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా మీనాక్షి నటరాజన్ నియమితులయ్యారు. దీపాదాస్ మున్షీ స్థానంలో మీనాక్షి నటరాజన్‌ను నియమిస్తూ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఉత్తర్వులు జారీ చేసింది.. ఈ మేరకు కేసీ వేణుగోపాల్ ప్రకటన విడుదల చేశారు. రాహుల్‌గాంధీ టీమ్‌లో కీలకంగా ఉన్న మీనాక్షి నటరాజన్ .. తెలంగాణ ఇన్‌ఛార్జ్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు.

కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా మీనాక్షి నటరాజన్ నియమితులయ్యారు. దీపాదాస్ మున్షీ స్థానంలో మీనాక్షి నటరాజన్‌ను నియమిస్తూ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఉత్తర్వులు జారీ చేసింది.. ఈ మేరకు కేసీ వేణుగోపాల్ ప్రకటన విడుదల చేశారు. రాహుల్‌గాంధీ టీమ్‌లో కీలకంగా ఉన్న మీనాక్షి నటరాజన్ .. తెలంగాణ ఇన్‌ఛార్జ్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. మధ్యప్రదేశ్‌కు చెందిన మీనాక్షి నటరాజన్.. కాంగ్రెస్ పార్టీలో కింది స్థాయి నుంచి పని చేస్తూ వచ్చారు. ఎన్ఎస్‌యూఐ, యూత్ కాంగ్రెస్ వింగ్ లలో అలాగే.. AICCలో కీలక బాధ్యతల్లో పనిచేశారు. 2009 ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌లోని మంద్‌సౌర్ నుంచి పోటీ చేసి ఆమె విజయం సాధించారు. అయితే తర్వాత రెండు సార్లు ఓడిపోయారు. మీనాక్షి నటరాజన్ రాహుల్ గాంధీ టీమ్ సభ్యురాలిగా గుర్తింపు పొందారు.
కాగా.. గతకొంత కాలం నుంచి తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇంఛార్జి మార్పు ఖాయమంటూ ఆ పార్టీ వర్గాలు పేర్కొంటూ వచ్చాయి.. అయితే.. దీపాదాస్ మున్షీ కేరళ, తెలంగాణ రెండు రాష్ట్రాలకు ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు. ఈ క్రమంలో తెలంగాణను పట్టించుకోవట్లేదన్న ఆరోపణలున్నాయి. సీనియర్లు కలవకుండా, ఫోన్ లిఫ్ట్ చేయకుండా అవమానిస్తున్నారన్న చర్చ పార్టీలో నడుస్తూ వచ్చింది.. దీపాదాస్ మున్షీ తీరుతో పార్టీకి నష్టం జరుగుతుందని.. వెంటనే ఆమెను మార్చాలని తెలంగాణ నేతలు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాయి.. ఈ క్రమంలోనే.. ఆమెను కేరళకు పరిమితం చేసి, కొత్త వారికి అవకాశం ఇవ్వడం పార్టీ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతుంది.
Hon’ble Congress President Shri @kharge has appointed the following party functionaries as AICC General Secretaries/In-charges of the respective States/UTs, with immediate effect. pic.twitter.com/zl8Y0eP5ZM
— Congress (@INCIndia) February 14, 2025
దీంతోపాటు ఏఐసీసీ పలు రాష్ట్రాలకు ఇన్ఛార్జ్లను ప్రకటించింది. హిమాచల్ప్రదేశ్, హర్యానా, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఒడిశా, జార్ఖండ్, మణిపూర్, బీహార్ రాష్ట్రాల కాంగ్రెస్కు కొత్త ఇన్ఛార్జులు.. పంజాబ్, జమ్ము కశ్మీర్ కు కొత్త జనరల్ సెక్రటరీలను నియమించింది.