వరంగల్ మెడికో ప్రీతి ఆత్మహత్య వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటి వరకు ప్రీతి సీనియర్ విద్యార్థి వేధింపులు భరించలేక ఇంజక్షన్ తీసుకొని ఆత్మహత్య చేసుకుందని అంతా భావించారు. అయితే తాజాగా వచ్చిన టాక్సికాలజీ రిపోర్టులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రీతి శరీరంలో అసలు ఎలాంటి విష రసాయనాలు లభ్యం కాలేదని రిపోర్టులో తేలింది. వరంగల్ సీపీ రంగనాథ్‌కు టాక్సికాలజీ రిపోర్ట్ చేరింది. దీంతో ప్రీతి కేసు పోలీసులకు సవాల్‌గా మారింది.
అనుమానాస్పద మృతి కేసు నమోదుచేసే యోచనలో పోలీసులు ఉన్నారు. దీంతో ప్రతీ కుటంబ సభ్యులు ఆమెది హత్యే అని ఆరోపిస్తున్నారు. ఇందులో భాంగానే అడిషనల్ డీజీపీని కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ప్రీతి ఎపిసోడ్‌లో అసలేం జరిగిందో తేల్చేందుకు పూర్తి స్థాయిలో విచారణ చేటప్టాలని కోరారు. అసలు శరీరంలో ఎలాంటి పాయిజన్ ఆనవాళ్లు లేకపోతే ప్రీతి ఎలా చనిపోయిందో చెప్పాలని పేరెంట్స్ ప్రశ్నిస్తున్నారు.
ప్రీతి కడుపు మొత్తం క్లీన్‌చేసి, బ్లడ్ ఛేంజ్ చేశాక రిపోర్ట్ అలా కాకపోతే ఇంకెలా ఉంటుందని ప్రీతి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మరి ఎన్నో మలుపులు తిరుగుతున్న ప్రీతి కేసు చివరికి ఎలాంటి టర్న్ తీసుకుంటుందో చూడాలి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..