Medaram Jatara 2025: మినీ మేడారం జాతర తేదీలు ఖరారు.. ఎప్పటి నుంచి ఎప్పటి వరకో తెలుసా..?

| Edited By: Subhash Goud

Oct 26, 2024 | 8:28 PM

వరంగల్‌ మేడారం సమ్మక్క సారక్క దేవతల మినీ జాతరకు తేదీలు ఖరారు చేసింది దేవాదాయ శాఖ. వచ్చే ఏడాదిలో జరిగే ఈ మినీ జాతరకు ఏర్పాట్లు చేయాలని పూజారులు అధికారులకు లేఖ రాశారు..

Medaram Jatara 2025: మినీ మేడారం జాతర తేదీలు ఖరారు.. ఎప్పటి నుంచి ఎప్పటి వరకో తెలుసా..?
Follow us on

వనదేవతలు మేడారం సమ్మక్క సారక్క దేవతల మినీ జాతరకు తేదీలు ఖరారయ్యాయి. ఫిబ్రవరి 12వ తేదీ నుండి 15వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు జరిగే మినీ జాతర తేదీలను (వడ్డెలు) పూజారుల సంఘం ప్రకటించింది. మినీ జాతరకు తగిన ఏర్పాట్లు చేయాలని దేవాదాయ శాఖకు పూజారులు లేఖ రాశారు. తెలంగాణ కుంభమేళ మేడారం మహా జాతర రెండేళ్లకోసారి జరుగుతుంది. ఐతే మహా జాతర జరిగిన మరుసటి యేట ఆదివాసీలు పండుగ నిర్వహించుకోవడం ఆనవాయితీగా కొనసాగుతుంది. ఆదివాసీల పండుగ మినీ జాతరగా ప్రాశస్త్యంలోకి వచ్చింది.

మహాజాతర తరహాలోనే మినీ జాతర కూడా నిర్వహిస్తారు. 2025 ఫిబ్రవరి మాసంలో నిర్వహించే మినీజాతరను ఫిబ్రవరి 12వ తేదీన ప్రారంభిస్తారు.13, 14, 15 తేదీలలో మొత్తం నాలుగు రోజుల పాటు మినీ జాతర నిర్వహించనున్నారు.

ఐతే 2023 మినీజాతరకు దాదాపు 15 లక్షల మందికి పైగా భక్తులు వచ్చారు. మాహా జాతర సమయంలో మొక్కులు తీర్చుకోవడం వీలు పడని భక్తులు మినీ జాతర సమయంలో సమ్మక్క సారక్క దేవతలకు మొక్కులు తీర్చుకున్నారు. ఈ సారి నాలుగు రోజుల వ్యవధిలో 25 లక్షల మంది వరకు హాజరవుతారని అంచనాలు వేస్తున్న పూజారులు అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని దేవాదాయ శాఖకు లేఖ ద్వారా తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి