
నెల నెలా భారీ మొత్తంలో జీతం తీసుకునే కరెంటాఫీసరు దర్జాగా ఒడ్డు మీద కూర్చుంటే. ఆరుగాలం శ్రమిస్తే తప్ప అయిదువేళ్లు నోట్లోకి వెళ్లని బక్క రైతును కరెంటు స్తంభం ఎక్కి మరమ్మత్తులు చేశాడు. తాము చేయాల్సిన మరమ్మతు పనులను రైతులతో చేయిస్తూ నిర్లక్ష్యం వ్యవహరిస్తున్న విద్యుత్ అధికారుల తీరుపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపల్ పరిధిలో తూప్రాన్ వెళ్లే దారిలో 11కేవీ విద్యుత్ తీగలు తెగి రైతుల పొలాల్లో పడ్డాయి. మూడు రోజులు అయినా వాటిని తొలగించకపోవడంతో స్థానిక రైతులు ఈ సమస్యను విద్యుత్ అధికారులు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో నర్సాపూర్ ఏఈ రామ్మూర్తి అక్కడకు చేరుకొని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం వాటిని తొలగించకపోగా.. అక్కడే గట్టుపై కూర్చొని నారాయణ అనే రైతును స్తంభాలు ఎక్కించి మరమ్మతులు చేయించాడు. ఇందేంటని స్థానిక రైతులు నిలదీయగా.. సిబ్బంది లేదరని ఏఈ నిర్లక్ష్యపు సమాధానం చెప్పారు. దీంతో సదురు అధికారి తీరుపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అధికారులు, సిబ్బంది లక్షల్లో జీతాలు తీసుకుంటూ పనిచేయకుండా ఇలా రైతులతో పనిచేయించడం ఏంటని.. ఇలాంటి అధికారుల పై తప్పకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు. ఇదే విషయం పై జిల్లా విద్యుత్ ఎస్సీ నారాయణ నాయక్ ను టీవీ9 వివరణ కోరగా ఇప్పటివరకు ఈ విషయం తన దృష్టికి రాలేదని.. ఈ విషయం పై సమగ్ర విచారణ చేయించి.. సదరు అధికారిపై, అక్కడ సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.