Hyderabad: ఇకనుంచి ఓఆర్ఆర్‌పై గంటకు ఈ వేగంతో వెళ్లొచ్చు

హైదరాబాద్‌లో ఔటర్ రింగు రోడ్డుపై ప్రయాణించే వాహన దారులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఔటర్ రింగ్ రోడ్ పై స్పీడ్ లిమిట్ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఔటర్ రింగ్‌రోడ్డుపై ఉన్న వేగ పరిమితి గంటకు 100 కిలోమీటర్ల వేగం ఉండేది. ఇప్పుడు తాజాగా ఆ వేగాన్ని 120 కి.మీలకు పెంచారు.

Hyderabad: ఇకనుంచి ఓఆర్ఆర్‌పై గంటకు ఈ వేగంతో వెళ్లొచ్చు
Orr

Updated on: Jun 28, 2023 | 5:03 AM

హైదరాబాద్‌లో ఔటర్ రింగు రోడ్డుపై ప్రయాణించే వాహన దారులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఔటర్ రింగ్ రోడ్ పై స్పీడ్ లిమిట్ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఔటర్ రింగ్‌రోడ్డుపై ఉన్న వేగ పరిమితి గంటకు 100 కిలోమీటర్ల వేగం ఉండేది. ఇప్పుడు తాజాగా ఆ వేగాన్ని 120 కి.మీలకు పెంచారు. ఈ విషయాన్ని తెలంగాణ అర్బన్ డెవలప్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అర్వింద్‌ కుమార్‌ ట్వీట్టర్ వేదికగా వెల్లడించారు. అలాగే వేగ పరిమితిని పెంచడానికి కావాల్సిన అన్ని రకాల భద్రతా ప్రోటోకాల్‌లను పాటించాలని హెచ్ఎండీఏను ఆదేశించారు.

ఇదిలా ఉండగా ఓఆర్‌ఆర్‌పై కూడా చాలావరకు ప్రమాదాలు జరగుతూనే ఉన్నాయి. ఈ ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో గతంలో సైబరాబాద్ పోలీసులు ఓఆర్‌ఆర్‌పై వేగ పరిమితిని గంటకు 120 కిలోమీటర్ల నుంచి 100 కిమీకి తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అప్పట్లో రెండు లేన్లలో వేగం కనిష్ఠంగా 80 కి.మీ, గరిష్టంగా 100 కి.మీ ఉండాలని నిర్ణయించారు. మూడు, నాల్గో లేన్లలో వేగపరిమితిని 40 కి.మీ నిర్ణయించారు. అయితే తాజాగా ఈ వేగపరిమితిని మళ్లీ 120 కి.మీటర్లకు పెంచారు. అలాగే ఓఆర్ఆర్ పై ప్రయాణికుల భద్రతకు అదనపు చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి