జనగామ జిల్లాలో విషాదం.. అనుమానాస్పద స్థితిలో 9 పాడిపశువులు మృతి.. విషప్రయోగమే కారణమా..?

|

Jan 11, 2021 | 9:15 PM

ఒకే కుటుంబంలోని ఇద్దరు అన్నదమ్ములకి చెందిన తొమ్మిది పాడి గేదెలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాయి. జనగాం జిల్లాలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

జనగామ జిల్లాలో విషాదం.. అనుమానాస్పద స్థితిలో 9 పాడిపశువులు మృతి.. విషప్రయోగమే కారణమా..?
Follow us on

ఒకే కుటుంబంలోని ఇద్దరు అన్నదమ్ములకి చెందిన తొమ్మిది పాడి గేదెలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాయి. జనగాం జిల్లాలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆదివారం సాయంత్రం పాలు ఇచ్చిన పశువులు, తెల్లారేసరికి మృత్యువాత పడటం ఆ గ్రామంలో కలకలం రేపుతోంది.  జిల్లాలోని తరిగొప్పుల మండలం అంకుశపూర్ గ్రామానికి చెందిన అన్నదమ్ములు సలీమ్, కళిల్ అనే రైతులకు చెందిన తొమ్మిది పశువులు అనుమానస్పద స్థితిలో మృత్యువాత =పడ్డాయి. శనివారం సాయంత్రం పాలుపితికి పశువుకు మేత పెట్టిన అన్నదములు, ఉదయం భావి వద్దకొచ్చి చూడగా మృత్యువాత పడివున్నాయి. అది చూసిన బాధితులు భోరున విలపించడం అందరిని కలిచి వేసింది.

తమకున్న కొద్దిపాటి వ్యవసాయం చేసుకుంటూ జీవనం గడుపుతున్న అన్నదమ్ములిద్దరూ… ఇటివల లక్షలు వెచ్చించి ఈ పశువులను సంతలో కొనుగోలు చేసుకొని పొట్ట పోసుకుంటున్నారు. గేదెల మరణం తమను కోలుకోలేని దెబ్బతీసిందని బాధితులు కన్నీరుమున్నీరయ్యారు.
ఈ సంఘటన జరిగిన తీరును చూస్తే.. ఎవరో విష ప్రయోగం చేసి చంపి ఉంటారని అనుమానులు వ్యక్తమవుతున్నాయి. మృతి చెందిన పశువుల్లో 3 జేర్సీ ఆవులు, ఒక గేదె, 3 లేగ దూడలు, 2 దూడలు ఉన్నాయి. తాము వాటి పైనే ఆధారపడి బతుకుతున్నామని, ఎవ్వరికీ ఏ హానీ చేయలేదని చెబుతున్నారు. చనిపోయిన పశువుల విలువ సుమారుగా రూ. 4 లక్షల వరకు ఉంటుందని తెలిపారు.

Also Read:

Daily essentials: సామాన్యులకు మరో షాక్.. పెరగనున్న వంట నూనె , సబ్బులు, బిస్కెట్ల ధరలు

AP Local Body Polls: ఏపీ పంచాయితీ ఎన్నికల షెడ్యూల్‌ను సస్పెండ్ చేసిన హైకోర్టు.. ప్రజారోగ్యం దృష్టిలో పెట్టుకున్నట్లు వెల్లడి

Andhra Pradesh Ration: ఏపీలో ఇకపై ఓటీపీ చెబితేనే రేషన్.. ఫిబ్రవరి నుంచి అమల్లోకి కొత్త విధానం..