Marriage Bus: వరద నీటిలో చిక్కుకున్న పెళ్లి బస్సు.. స్థానికులు సాయంతో తప్పిన పెను ప్రమాదం..

|

Jun 21, 2022 | 3:21 PM

సోమవారం రోజు రాత్రి కురిసిన వర్షానికి ఆర్‌ఓబీ కిందకు భారీగా వరద నీరు పోటెత్తింది. అయితే వరద నీటిని సరిగా అంచనా వేయని బస్సు డ్రైవర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి కింది నుండి బస్సును ముందుకు పోనిచ్చాడు

Marriage Bus: వరద నీటిలో చిక్కుకున్న పెళ్లి బస్సు.. స్థానికులు సాయంతో తప్పిన పెను ప్రమాదం..
Marriage Bus In Vikarabad
Follow us on

Marriage Bus: నైరుతి రుతుప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రహదారులు నదులను తలపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వికారాబాద్ జిల్లాలో(Vikarabad)పెళ్లి బృందానికి పెను ప్రమాదం తప్పింది. మోమిన్‌పేట్ రైల్వే ఓవర్ బ్రిడ్జి కింద వరద నీటిలో పెళ్లి బస్సు చిక్కుకుంది. వరద నీటిలో చిక్కుకున్న ప్రైవేట్ బస్సు ముందుకు వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. ఈ సమయంలో వరద నీరు క్రమంగా పెరుగుతుంది. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ప్రత్యేక బృందాలతో అక్కడికి చేరుకున్న సహాయక సిబ్బంది ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది.

సోమవారం రోజు రాత్రి కురిసిన వర్షానికి ఆర్‌ఓబీ కిందకు భారీగా వరద నీరు పోటెత్తింది. అయితే వరద నీటిని సరిగా అంచనా వేయని బస్సు డ్రైవర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి కింది నుండి బస్సును ముందుకు పోనిచ్చాడు. వరద నీటిలో బస్సు ముందుకు వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. వెంటనే అప్రమత్తమైన బస్సులోని ప్రయాణీకులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్థానికుల సహాయంతో పోలీసులు బస్సులోని ప్రయాణీకులను బయటకు తీశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..