Telangana: రాధ హత్యపై స్పందించిన మావోయిస్టులు.. లేఖ విడుదల

| Edited By: Narender Vaitla

Aug 24, 2024 | 12:08 PM

శత్రువుకు కోవర్టుగా మారి విప్లవ ద్రోహానికి పాల్పడిన బంటి రాధ మరణంపై పోలీసుల దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నట్లు లేఖలో ప్రస్తావించారు. రాధ మరణానికి పోలీసులే భాద్యత వహించాలని నిలదీయండని లేఖలో పేర్కొన్నారు. విప్లవ ద్రోహిగా మారిన నాకు మరణ శిక్ష విధించడం సరైందని రాధ మనస్పూర్తిగా ఒప్పుకుని నాలా మరొకరు ద్రోహిగా మారకూడదని...

Telangana: రాధ హత్యపై స్పందించిన మావోయిస్టులు.. లేఖ విడుదల
Representative Image
Follow us on

మహిళా మావోయిస్టు నీల్సో రాధ హత్యపై మావోయిస్టులు స్పందించారు. ఇందుకు సంబంధించి లేఖను విడుదల చేశారు. ఏవోబీ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి గణేష్ పేరిట విడుదల చేసిన లేఖలో సంచలన విషయాలు వెల్లడించారు. మూడు రోజుల క్రితం మహిళా మావోయిస్టు నీల్సో రాధను పోలీసుల కోవర్టుగా మారిందని..మావోయిస్టులు హత్య చేసిన విషయం తెలిసిందే.

శత్రువుకు కోవర్టుగా మారి విప్లవ ద్రోహానికి పాల్పడిన బంటి రాధ మరణంపై పోలీసుల దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నట్లు లేఖలో ప్రస్తావించారు. రాధ మరణానికి పోలీసులే భాద్యత వహించాలని నిలదీయండని లేఖలో పేర్కొన్నారు. విప్లవ ద్రోహిగా మారిన నాకు మరణ శిక్ష విధించడం సరైందని రాధ మనస్పూర్తిగా ఒప్పుకుని నాలా మరొకరు ద్రోహిగా మారకూడదని విజ్ఞప్తి చేసిందని లేఖలో ప్రస్తావించారు.

వాస్తవాలపై పోలీసులు స్పందించకుండా కులం, జండరను అడ్డం పెట్టుకుని కొన్ని సంఘాల పేరుతో నీచ ప్రచారం చేస్తుందని, నిత్యం దళిత, ఆదివాసీ మహిళలపై అత్యాచారాలకు పాల్పడే ఈ పోలిసులకు రాధ మరణంపై మాట్లాడే నైతిక అర్హత లేదంటూ ఆరోపణలు సంధించారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు వాస్తవాలను గ్రహించి రాధ మృతికి కారణమైన పోలీసులను నిలదీయండని అని.. పోలీసుల మోసకారి మాటలను నమ్మొద్దని మావోయిస్టులు లేఖలో పేర్కొన్నారు.

ఇది వారి క్రూరత్వానికి నిదర్శనం..

ఇదిలా ఉంటే రాధను చంపి మృతదేహాన్ని రోడ్డుపై పడేసిన మావోయిస్టు నేతలు మాయ మాటలతో ప్రకటనలు విడుదల చేయడం వారి క్రూరత్వానికి నిదర్శనమని భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్‌రాజ్‌ తెలిపారు. ఉన్న చదువులు చదువుకున్న రాధను బలవతంగా పార్టీలో చేర్చుకొని, తనకు జీవితాన్నే లేకుండా చేసిన మావోలకు మానవత్వమే లేదని ఈ ఘటనతో అర్థమవుతోందని అన్నారు. తమ తప్పును కప్పిపుచ్చుకోవడానికి పోలీసులే బాధ్యత వహించాలని చెబుతున్నారని దుయ్యబడుతున్నారు. దళిత మహిళ రాధపై పోలీస్‌ ఇన్‌ఫార్మర్‌ అని ముద్రవేయడం ఆ పార్టీ నేతల నీచమైన ఆలోచనలకు నిదర్శనమని విమర్శించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..