Mango Price: ‘మామిడి’ డిమాండ్ మామూలుగా లేదు.. ధర ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు..!

Mango Price: మామిడి రికార్డు ధర పలుకుతోంది. ఈ యేడాది టన్ను 70వేల నుండి లక్ష రూపాయలు పలుకుతోంది. సప్లయ్‌ తగ్గడంతో డిమాండ్‌ ఒక్కసారిగా పెరిగింది.

Mango Price: ‘మామిడి’ డిమాండ్ మామూలుగా లేదు.. ధర ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు..!
Mango
Follow us

|

Updated on: Apr 12, 2022 | 5:48 AM

Mango Price: మామిడి రికార్డు ధర పలుకుతోంది. ఈ యేడాది టన్ను 70వేల నుండి లక్ష రూపాయలు పలుకుతోంది. సప్లయ్‌ తగ్గడంతో డిమాండ్‌ ఒక్కసారిగా పెరిగింది. సామాన్యులు మామిడి టేస్ట్‌ చేసే పరిస్థితి కనిపించడం లేదు. వరంగల్ లక్ష్మీపురం పండ్ల మార్కెట్ మామిడికి ఫేమస్. ఇక్కడి నుండి పంజాబ్,హర్యానా,యూపీ,జమ్మూకశ్మీతోపాటు నేపాల్‌కు మ్యాంగో ఎగుమతి చేస్తారు. మామిడి పళ్లలో బంగినపల్లి రకం ఎంతో రుచిగా ఉంటుంది. ఈ యేడాది బంగినపల్లి మామిడి టన్నుకు లక్ష రూపాయలు పలుకుతోంది. గతేడాది ఇదే సమయానికి మార్కెట్‌కు 1,581 టన్నుల మామిడి విక్రయానికి వచ్చింది. కానీ.. ఈ యేడాది ఇప్పటివరకూ కేవలం 56 టన్నులు మాత్రమే మార్కెట్‌కు వచ్చాయి. ఎకరా మామిడి తోటవేస్తే 12 నుండి 15 టన్నుల దిగుబడి వచ్చే పరిస్థితి ఉంది. కానీ ఈ యేడాది రెండు, మూడు టన్నుల కన్నా ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం లేదని రైతులు అంటున్నారు.

గతేడాది దిగుబడి ఉన్నప్పటికీ టన్ను మామిడి 15 వేల నుండి 35 వేల వరకు పలికింది. ఈ యేడాది వర్షాలు చీడపీడలతో మామిడితోటలు పూర్తిగా దెబ్బతిన్న కారణంగా మామిడికాయ ఊహించినస్థాయిలో రావడం లేదు. దాంతో టన్ను మామిడి ఎన్నడూలేని విధంగా 70వేల నుండి లక్ష రూపాయలు పలుకుతోంది. ప్రస్తుత ధరలు చూస్తే సంతోషంగా ఉన్నప్పటికీ దిగుబడి లేక పెట్టుబడి రాని పరిస్థితి ఉందని రైతులు వాపోతున్నారు. అధికవర్షాలు, వైరస్‌ కారణంగా మామిడితోటలు 50శాతం దెబ్బతింటే..ప్రస్తుత వాతావరణంలో 90శాతం పంట దెబ్బతింటున్నాయి. ఉదయం ఎండ అధికంగా..రాత్రివేళలో మంచు కురవడంతో మామిడికాయ పిందె దశలోనే రాలిపోతున్నాయని రైతులంటున్నారు. మార్చి నుండే మామిడి పండ్ల సీజన్ ప్రారంభమవుతుంది. కానీ..ఈ యేడాది వాతావరణ మార్పులు, చీడపీడలతో తోటలు దెబ్బతిని…ఏప్రిల్‌ రెండోవారంలో కూడా మామిడి మార్కెట్‌కు పెద్దమొత్తంలో తరలిరావడం లేదని వ్యాపారులు తెలిపారు. ఇక రైతులు మార్కెట్‌కు వచ్చే ముందు కాయ సైజు చూసుకొని తీసుకొస్తే మరింత ధర లభించే అవకాశం ఉంటుందని ఏనుమాముల మార్కెట్‌ సిబ్బంది చెబుతున్నారు.

Also read:

IPL 2022: వరుసగా రెండో మ్యాచ్‌ గెలిచిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌.. కెప్టెన్‌ ఇన్సింగ్స్‌ ఆడిన విలియమ్సన్..

Investment: ఇన్వెస్ట్మెంట్స్ చేయడంలో మహిళలు ఎందుకు వెనకబడుతున్నారు.. కారణమేంటంటే..

విద్యార్ధులకు అలర్ట్! TSRJC CET 2022 దరఖాస్తు గడువు పెంపు! ఎప్పటివరకంటే..

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో