పంట పండినా కంట‌త‌డే.. ఇవీ కార‌ణాలు.. ఆదుకునే నాథుడేడి?

|

Jun 04, 2021 | 1:21 PM

రసాలు, బంగినపల్లి, కోడూర్, కోత మామిడి, తోతాపురి, ఇలా మామిడి పండ్ల పేర్లు చెప్పితే నోరూరుతుందా? జనవరి నాటికి పూత పూసి.. ఏప్రిల్‌, మే నాటికి కోతకు వచ్చే...

పంట పండినా కంట‌త‌డే.. ఇవీ కార‌ణాలు.. ఆదుకునే నాథుడేడి?
Mango Season
Follow us on

రసాలు, బంగినపల్లి, కోడూర్, కోత మామిడి, తోతాపురి, ఇలా మామిడి పండ్ల పేర్లు చెప్పితే నోరూరుతుందా? జనవరి నాటికి పూత పూసి.. ఏప్రిల్‌, మే నాటికి కోతకు వచ్చే మామిడి పండ్లకు ఏటా యమ గిరాకీ ఉంటుంది. ఈసారి ప్రకృతి విపత్తులను ఎదుర్కొని ఆశించిన దానికంటే అధికంగానే దిగుబడులు వచ్చాయి. రోడ్లపై, మార్కెట్లలో ఎక్కడ చూసినా మామిడి పండ్లు దర్శనమిస్తున్నాయి. కానీ, మామిడి అమ్మకాలపై లాక్‌డౌన్‌ ప్రభావం అధికంగా ఉంది. జనగాం జిల్లాలో ఈ సంవత్సరం పెద్ద మొత్తంలోనే మామిడి సాగు చేపట్టారు. దీనికి తగ్గట్లు దిగుబడులు కూడా ఆశించిన మేరకే వచ్చాయి. జిల్లాలోని దేవరుప్పుల, లింగాల ఘనపురం, బచ్చన్నపేట,స్టేషన్ ఘనపూర్, పాలకుర్తి, రఘునాథపల్లి, జనగాం ప్రాంతాల్లో అధిక మామిడి పండింది. జిల్లా వ్యాప్తంగా సుమారుగా 9,500 ఎకరాల్లో మామిడి సాగైనట్లు అధికారులు వెల్లడించారు. అయితే ప్రకృతి విపత్తులను దాటుకుని వచ్చిన రైతాంగానికి కరోనా మహమ్మారి అడ్డంకిగా మారింది. కరోనా లాక్‌డౌన్‌తో ఆశించిన స్థాయిలో మామిడి అమ్మకాలు జరగడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెటింగ్‌ శాఖ ఆదేశాలు క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. మార్కెట్లలో అమ్మకానికి పెట్టిన మామాడి కాయలు అకాల వర్షానికి కుల్లిపోతుందని రైతులంటున్నారు.

ఇక బహిరంగ మార్కెట్‌లోనూ ఆశించిన స్థాయిలో అమ్మకాలు లేక చెట్ల మీదనే పండ్లు కుల్లిపోయే పరిస్థితి తలెత్తుతోంది. వేల ఎకరాల్లో మామిడి నేల రాలుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, ధాన్యం కొంటున్న విధంగానే మామిడి రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు.

Also Read: ఉత్తర కొరియాలో ఆకలి కేకలు.. విదేశాల సాయం కోరేందుకు కిమ్‌కు నోరు వస్తుందా?

ఇక నుంచి మరింత సులభతరం.. ప్రాంతీయ భాషల్లోనూ టీకా రిజిస్ట్రేషన్‌.. కేంద్రం కీలక నిర్ణయం