AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: మహేష్ హత్య కేసులో బయటపడుతున్న సంచలన విషయాలు.. ఆ న్యూడ్ వీడియోలే..

మంచిర్యాల జిల్లా ఇందారంలో మంగళవారం జరిగిన మహేష్ హత్య కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఇప్పటి వరకు వేధింపులు అనుకున్న వ్యవహారం కాస్తా.. ప్రేమ వ్యవహారంగా తేలింది. ‘నాకు నువ్వే కావాలి’ అంటూ వివాహిత తన మాజీ ప్రియుడు మహేష్‌కు పదే పదే ఫోన్ కాల్స్ చేయగా.. అవి ఇప్పుడు బయటపడ్డాయి.

Telangana: మహేష్ హత్య కేసులో బయటపడుతున్న సంచలన విషయాలు.. ఆ న్యూడ్ వీడియోలే..
Indaram Murder Case
Shiva Prajapati
|

Updated on: Apr 26, 2023 | 2:04 PM

Share

మంచిర్యాల జిల్లా ఇందారంలో మంగళవారం జరిగిన మహేష్ హత్య కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఇప్పటి వరకు వేధింపులు అనుకున్న వ్యవహారం కాస్తా.. ప్రేమ వ్యవహారంగా తేలింది. ‘నాకు నువ్వే కావాలి’ అంటూ వివాహిత తన మాజీ ప్రియుడు మహేష్‌కు పదే పదే ఫోన్ కాల్స్ చేయగా.. అవి ఇప్పుడు బయటపడ్డాయి. దాంతో ఈ కేసు మరో టర్న్ తీసుకుంది. వాట్సాప్ కాల్‌లో ‘ఐదేళ్లు సంతోషంగా ఉన్నాం. ప్రేమించుకున్నాం. ఇప్పుడు కూడా అలాగే చూసుకోవాలి’ అంటూ వివాహిత మృతుడు మహేష్‌ను కోరిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.

కాగా, గత ఏడాది మే 21వ తేదీన మంచిర్యాల జిల్లా నస్పూర్‌కు చెందిన ఓ యువకుడితో మహేష్ ప్రియురాలికి పెళ్లి నిశ్చయమైంది. పెళ్లైన మూడు నెలల్లోనే భార్య ప్రవర్తన నచ్చక విడాకులకు సిద్దమయ్యాడు ఆమె భర్త. ఈ క్రమంలోనే మాజీ ప్రియుడు అయిన మహేష్.. తన ప్రియురాలి భర్తకు ఇద్దరూ సన్నిహితంగా ఉన్న న్యూడ్ వీడియోస్, ఫోటోలు పంపించాడు. దాంతో మనస్తాపానికి గురైన మహిళ భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కేసులో ఇప్పటికే మూడు నెలలు జైలు శిక్ష అనుభవించాడు మహేష్. తమ కొడుకు మృతికి కారణమైన మహేష్‌పై కక్ష పెంచుకున్న కుటుంబ సభ్యులు.. మంగళవారం నాడు దారికాచి మరీ అత్యంత క్రూరంగా చంపేశారు.

అయితే, ఈ హత్య నేపథ్యంలోనే గతంలో మహేష్ తన ప్రియురాలితో మాట్లాడిన వీడియోలు తాజాగా లీక్ అయ్యాయి. నువ్వే కావాలంటూ పదే పదే కోరడంతోనే తన కొడుకు అసభ్యకరమైన వీడియోలను మహిళ భర్తకు పంపాడని మహేష్ బంధువులు చెబుతున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే మహేష్ హత్య కేసులో నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరి ఈ కేసులో మరెన్ని నిజాలు వెలుగు చూస్తాయో అనేది ఉత్కంఠగా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..