Hyderabad: మద్యం కోసం డబ్బులు ఇవ్వలేదని కన్న తల్లిని చంపిన కొడుకు.. కోర్టు ఇచ్చిన తీర్పు ఏంటంటే

| Edited By: Ram Naramaneni

Jul 19, 2023 | 2:19 PM

ఈ మధ్య కాలంలో గంజాయి, మధ్యపానం సేవించడం విచ్చలవిడిగా పెరిగిపోయింది. చిన్నా, పెద్దా అని తేడా లేకుండా అందరూ వీటికి అలవాటు పడిపోతున్నారు. ముఖ్యంగా కొంతమంది యువకులు గంజాయికి బానిస అయిపోయి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి.

Hyderabad: మద్యం కోసం డబ్బులు ఇవ్వలేదని కన్న తల్లిని చంపిన కొడుకు.. కోర్టు ఇచ్చిన తీర్పు ఏంటంటే
Prison
Follow us on

హైదరాబాద్, జులై 19: ఈ మధ్య కాలంలో గంజాయి, మద్యపానం సేవించడం విచ్చలవిడిగా పెరిగిపోయింది. చిన్నా, పెద్దా అని తేడా లేకుండా అందరూ వీటికి అలవాటు పడిపోతున్నారు. ముఖ్యంగా కొంతమంది యువకులు గంజాయికి బానిస అయిపోయి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. చదువుకోవాల్సిన వయసులో చెడు వ్యసనాలకు అలవాటు పడి తమ తల్లిదండ్రులు కన్న కలల్ని మంటలో కలిపేస్తున్న దుస్థితి నెలకొంది. భవిష్యత్తు గురించి ఆలోచించకుండా.. ఏ లక్ష్యమూ లేకుండా మాదక ద్రవ్యాలకు అలవాటు పడి కుటుంబ పరిస్థితిని దిగజార్చే సందర్భాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో గంజాయికి అలవాటు పడ్డ ఓ 22 ఏళ్ల యువకుడు తన తల్లిని మద్యం కోసం డబ్బులు అడిగితే ఇవ్వలేదని ఆమెను హత్య చేయడం గతంలో కలకలం రేపింది. ఇప్పుడు తాజాగా ఆ యువకుడికి కోర్టు జీవిత ఖైదు విధించింది.

వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్‌లోని బల్కంపేట్‌లో సంగిత (50) తన కొడుకు సంతు(22) తో కలిసి ఉండేది. అయితే సంతు మాత్రం గంజాయికి, మధ్యపానానికి వీపరీతంగా అలవాటు పడిపోయాడు. ఎప్పుడంటే అప్పుడు గంజాయి, మధ్యం సేవిస్తూ వాటికి బానిసగా మారిపోయాడు. అయితే 2021 జనవరిలో సంతు తన తల్లిని మధ్యం సేవించడం కోసం డబ్బులు ఇవ్వాలని అడిగాడు. కానీ అతని తల్లి అందుకు ఒప్పుకోలేదు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన సంతు.. కిచెన్‌లో ఉన్న కత్తిని తీసుకొని తన కన్న తల్లినే పొడిచేశాడు. తీవ్ర గాయాలపాలైన అతని తల్లి సంగీత అక్కడిక్కడే మృతి చెందింది. అప్పట్లో ఈ విషయం సంచలనం రేపింది. ఆ తర్వాత పోలీసులు సంతును అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో 2023 జులై 18న ఈ కేసుపై కోర్టు తీర్పు వెల్లడించింది. నిందితుడు సంతుకు కన్న తల్లిని చంపినందుకు గాను.. రూ.10 వేల జరిమానతో పాటు జీవిత ఖైదు విధించింది. ఫస్ట్ అడిషనల్ మెట్రోపాలిటన్ సెసన్స్ జడ్జ్ జస్టీస్ డి. రమనాకాంత్ ఈ తీర్పునిచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..